మనం దర్శకుడితో మూడోసారి...
Send us your feedback to audioarticles@vaarta.com
13బి` చిత్రంతో దర్శకుడుగా సక్సెస్ కొట్టిన విక్రమ్ కుమార్ మనం` సక్సెస్ తో స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇప్పుడు సూర్యతో 24` వంటి భారీ బడ్జెట్‌తో సైకలాజికల్ థ్రిల్లర్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత విక్రమ్ మహేష్‌తో కానీ, బన్నితో కానీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో హీరోయిన్గా సమంతనే తీసుకుంటున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. మనం`, 24` సినిమాల్లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన సమంత ముచ్చటగా మూడోసారి విక్రమ్ దర్శకత్వంలో నటించబోతుంది. అయితే అది మహేష్‌తో చేస్తుందా లేదా బన్నితో నటిస్తుందా అని తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments