సినిమా చూసి సమంత ఇంప్రెస్ అయ్యింది....

  • IndiaGlitz, [Saturday,September 10 2016]

స్టార్ హీరోయిన్‌గా తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో రాణిస్తున్న చెన్నై సంద్రం స‌మంత నిన్న 'జ్యోఅచ్యుతానంద' సినిమా చూసిందట‌. చాలా ఇంప్రెస్ అయ్యాను. ప్ర‌తి సీన్‌ అద్భుతంగా ఉంద‌ని, సినిమా ర‌చ‌న బావుంద‌ని, ఇలాంటి సినిమాలు మ‌రిన్ని సినిమాలు రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని స‌మంత త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చింది. వారాహి చల‌న చిత్రం ద్వారా విడుద‌లైన 'జ్యోఅచ్యుతానంద‌'లో నారారోహిత్‌, నాగ‌శౌర్య‌లు న‌టించారు. నటుడు అవసరాల దర్శకత్వంలో రూపొందిన రెండో చిత్రమిది. చిత్రం మంచి ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్షకుల నుండి, విమర్శకుల నండి మంచి ప్ర‌శంస‌లు అందుకుంటుంది. ద‌ర్శ‌క ధీరుడు కూడా సినిమా బావుంద‌ని ప్ర‌శంసించాడు.