గోవాలో సొంతిల్లు.. సమంత కోరిక ఇదేనట!
Send us your feedback to audioarticles@vaarta.com
సొంతిల్లు అంటే ఎవరికైనా మక్కువే. జీవితకాలంలో తనకంటూ ఓ ఇల్లు ఉండాలని ఎవరైనా భావిస్తుంటారు. ఇప్పుడలాంటి ఆలోచనల్లోనే అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఉందని తెలుస్తోంది. అదేంటి.. ఆమెకు సొంతిల్లు లేకపోవడం ఏంటని ఆలోచిస్తున్నారా? కట్టుకున్న భర్తకు లంకంత ఇల్లులు ఉండగా.. ఈ సొంతింటి గోల ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఆగండాగండి.. అసలు విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మకు గోవా అంటే చాలా ఇష్టం. అక్కడో ఇల్లు కట్టుకోవాలనే ప్లాన్‌లో ఆమె ఉందట. దీనికి ఓ కారణం కూడా ఉంది. పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా.. ఎలాంటి సంతోషకరమైన సందర్భమైనా గోవాలోనే ప్లాన్ చేస్తుంటుంది. తన భర్త నాగచైతన్యతో కలిసి అక్కడికి చెక్కేస్తుంటుంది. గోవా సముద్రతీరంలో ఆ సంతోషకరమైన క్షణాలను గడుపుతుంటుంది. ఇప్పుడక్కడే ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంటుందట.
బాలీవుడ్ స్టార్స్ షారుఖ్, ఐశ్వర్యలకు అక్కడ విల్లాలు ఉన్నాయట. వారిలా తాను కూడా సకల సౌకర్యాలతో ఇల్లు కట్టుకోవాలని భావిస్తోందట. ఇక భర్తతో కలిసి గోవాకు వెళితే.. ఆ ఇంట్లోనే ఉండాలన్నది ఆమె కోరికని తెలుస్తోంది.
ఇదలా ఉంచితే.. సమంత ప్రస్తుతం 96 రిమేక్ జాను సినిమాలో నటిస్తోంది. శర్వానంద్ హీరో. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా కూడా చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments