సమంత.. ఒకే రోజున రెండు చిత్రాలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ వేసవిలో సంచలన విజయం సాధించిన చిత్రం ‘రంగస్థలం’. ఇందులో పల్లెటూరి అమ్మాయి రామలక్ష్మిగా సమంత చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. ఈ నెలలో రెండు సినిమాలతో సందడి చేయనుంది ఈ బ్యూటీ. అందులో ఒకటి ‘మహానటి’ కాగా.. మరొకటి తమిళ అనువాద చిత్రం ‘అభిమన్యుడు’. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా తమిళంలో ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. ఇక్కడ ఈ నెల 9న విడుదల కానున్న ‘మహానటి’.. తమిళనాడులో ‘నడిగర్ తిలగం’ పేరుతో ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సామ్.. జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో నటించారు.
సావిత్రి జీవితాన్ని ప్రేక్షకులకు చెప్పే కీలకమైన పాత్ర ఇది. అలాగే ఇదే రోజున (మే 11న) విశాల్, సమంత జంటగా నటించిన ‘ఇరుంబుత్తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) చిత్రం కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో డాక్టర్ రతీదేవిగా.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపిస్తున్నారు సామ్. ఇలా ఒకే రోజున రెండు సినిమాలతో తమిళనాడులో సందడి చేయబోతున్న సామ్‌కి ఎటువంటి ఫలితం దక్కుతుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కన్నడ చిత్రానికి రీమేక్‌గా తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ‘యు టర్న్’ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నారు సామ్. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా తెరపైకి రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments