త‌మ‌న్నా గురించి స‌మంత ట్వీట్‌

  • IndiaGlitz, [Wednesday,March 04 2020]

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాను అభినందిస్తూ చెన్నై సొగ‌స‌రి స‌మంత అక్కినేని ట్వీట్ చేసింది. ఇంత‌కూ త‌మ‌న్నాను స‌మంత ఎందుకు అభినందించింది అని చూస్తే.. త‌మ‌న్నా హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి నేటికి15 ఏళ్లు పూర్త‌య్యాయి. శ్రీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన త‌మ‌న్నాఅగ్ర క‌థానాయిక‌గా ఎదిగింది. ఎన్నో భారీ విజ‌యాల‌ను సాధించిన చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించి త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను, అభిమానుల‌ను సంపాదించుకుంది త‌మ‌న్నా. ఈ అమ్మ‌డు సాధించిన ఫీట్‌ను అప్రిషియేట్ చేస్తూ స‌మంత కామ‌న్ డీపీని షేర్ చేసుకుంటూ ట్వీట్ చేసింది.

‘‘15 అద్భుత‌మైన సంవ‌త్స‌రాలు. ఎంతో అంద‌మైన‌, నిజాయ‌తీ, క‌ష్ట‌ప‌డేత‌త్వం ఉన్న ఎక్కువ‌గా ఉన్న వ్య‌క్తి త‌మ‌న్నా. చూపు తిప్పుకోలేని అందం ఆమెది. ఆమె ఓ ట‌పాకాయ్‌లాంటి అమ్మాయి. కంగ్రాట్స్ డార్లింగ్’’ అంటూ సమంత ట్వీట్ చేసింది. దానికి త‌మ‌న్నా ట్విట్ట‌ర్ ద్వారా రిప్ల‌య్ ఇస్తూ.. ‘‘సమంత.. ప్రతి పనిలోనూ నువ్వే నాకు స్ఫూర్తి. నువ్వు పాత్రలను ఎంచుకునే తీరు, వాటిని తెరపై పోషించే విధానం ఎంతో ఇన్‌స్పిరేష‌న్‌ను క‌లిగిస్తాయి’’ అన్నారు. స‌మంత‌, త‌మ‌న్నా ఇలా ఒక‌రినొక‌రు అభినందించుకుంటూ చేసిన ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అయ్యాయి.