ప్రభాస్, దీపికా పదుకొనె 'ప్రాజెక్ట్ కె' లో సమంత.. 200 రోజులా?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ తారాస్థాయికి చేరిందనడానికి అతడు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలే నిదర్శనం. ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె( వర్కింగ్ టైటిల్) చిత్రం అయితే యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఉంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కనీవినీ ఎరుగని విధంగా భారీ బడ్జెట్ లో ఈ చిత్రం ఉండబోతోందట.
ఇటీవలే గురు పూర్ణమి సందర్భంగా ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. బిగ్ బి అమితాబ్ ఈ చిత్రంలో అంత్యంత కీలక పాత్రలో నటిస్తున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మలయాళీ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ క్రేజ్ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజుల డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ప్రభాస్ ఇన్ని రోజులు ఈ చిత్రం కోసం డేట్స్ కేటాయించాడంటే సినిమా ఏస్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మూవీ కథపై అనేక ఊహాగానాలు ఉన్నాయి.
ప్రపంచ యుద్ధం నుంచి మానవాళిని రక్షించే సూపర్ హీరోగా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్, రోబోట్స్ ప్రస్తావన కూడా ఈ చిత్రంలో ఉంటుందట. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా రిలీజ్ చేసే సన్నాహకాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, సలార్ చిత్రాల్లో నటిస్తున్నాడు. రాధేశ్యామ్ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. సలార్ మూవీని కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com