సినిమాల నుండి సమంత వైదొలుగుతుందా..?

  • IndiaGlitz, [Saturday,July 02 2016]

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న స‌మంత రీసెంట్‌గా కూడా అఆ చిత్రంతో కూడా స‌క్సెస్ అందుకుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న జ‌న‌తాగ్యారేజ్‌లో న‌టిస్తుంది.

అయితే స‌మంత, అక్కినేని నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌లో ఉంద‌ని, ఇద్ద‌రి విహ‌హానికి పెద్ద‌లు అంగీకరించార‌ని, అందువ‌ల్ల సినిమాల నుండి స‌మంత తప్పుకునే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయంటూ, ప్ర‌స్తుతం నిర్మాత‌లు భారీ రెమ్యున‌రేషన్ ఇస్తాన‌న్న కూడా సినిమా చేయ‌డం లేద‌ని అంటున్నారు. అంతేకాకుండా త‌మిళంలో ధ‌నుష్ చిత్రం నుండి కూడా స‌మంత వైదొల‌గింద‌ని స‌మాచారం. మ‌రి ఈ విష‌యాల‌పై స‌మంత ఎలా రియాక్ట్ అవుతుందో తెలియ‌డం లేదు. నాగ‌చైత‌న్య, స‌మంత ఎవ‌రో ఒక‌రు నోరు విప్పితేనే అస‌లు విష‌యం తెలుస్తుంది.