ఆత్మ పాత్రలో సమంత...
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు కాబోయే మామ అక్కినేని నాగార్జునతో కలిసి `రాజుగారి గది2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్ అయిన రాజుగారి గది చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగార్జున ఇతరుల మైండ్ చదివే వ్యక్తి పాత్రలో కనపడుతున్నాడు. శీరత్‌కపూర్ ఈ సినిమాలో డ్యాన్సర్‌గా కనపడుతుంది.
అయితే మరి సమంత ఏ రోల్ చేస్తుందోనని అనుకున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం సమంత ఈ చిత్రంలో ఆత్మ పాత్రలో కనపడుతుందట. పార్ట్ 1లో పూర్ణ ఆత్మగా కనపడింది. ఇప్పుడు సమంత ఆత్మ పాత్రలో కనపడనుందన్నమాట. పార్ట్ 1కు ఎలాంటి సెట్‌ను అయితే ఉపయోగించారో అలాంటి సెట్‌నే ఇప్పుడు రాజుగారిగది 2లో కూడా ఉపయోగిస్తారట. ఈ సినిమాను పివిపి సినిమా నిర్మిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com