ఫేవరెట్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయబోతున్నసమంత
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవలే యువ కథానాయకుడు నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సమంత.. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీ అయ్యారు. ఓ వైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా 'రంగస్థలం 1985' చేస్తూనే.. మరోవైపు తమిళ కథానాయకుడు విశాల్ హీరోగా వస్తున్నఅభిమన్యుడు' లోనూ నటిస్తున్నారు సమంత.
ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రథమార్థంలో సందడి చేయనున్నాయి. అంతేకాకుండా.. తమిళంలో శివకార్తికేయన్, విజయ్ సేతుపతి హీరోలుగా చేస్తున్న సినిమాల్లో కూడా సమంత నటిస్తున్నారు. అలాగే 'మహానటి' మూవీలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఐదు సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. కన్నడలో విజయం సాధించిన యు-టర్న్ అనే థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాలని ఉందని.. అది తన ఫేవరెట్ ప్రాజెక్ట్ అని సమంత గతంలో వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు ఆ సినిమాని తెలుగు, తమిళ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు సమంత. అలాగే ఈ సినిమా డైరెక్టర్ పవన్ కుమార్ తో స్టోరీ డిస్కషన్స్ విషయమై.. నాగ చైతన్యతో కలిసి బెంగళూరుకి కూడా పయనమయ్యారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments