సమంత పాన్ ఇండియా మూవీ..?
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని కోడలుగా మారిన తర్వాత సమంత రేంజ్ మరో లెవల్‌లోకి వెళ్లింది. గ్లామర్ పాత్రలు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలే వస్తున్నాయి. అలాగే ఆమె సినిమాలను ఎంచుకుంటుంది. మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా కూడా నిలుస్తుంది. సినిమాలతోనే కాకుండా డిజిటల్ రంగంలోనూ ఆమె అడుగు పెట్టారు. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ని తెలుగులో ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేయగా అందులో సమంత నటించిన సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత `ద ఫ్యామిలీ మేన్` వెబ్ సిరీస్ సీజన్2లో ఓ నెగటివ్ పాత్రలో నటించింది. ఇలా డిఫరెంట్‌గా ఆలోచిస్తూ కెరీర్‌ను మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు సమంత అక్కినేని.
తాజా సమాచారం మేరకు సమంత అక్కినేని ఓ పాన్ ఇండియా మూవీలో నటించనుందని టాక్. బాలీవుడ్‌లో సినిమాలను నిర్మించే సోనీ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందబోయే ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు? అనేది డిస్కషన్స్ జరుగుతున్నాయట. తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఉందని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com