సమంత టెర్రస్ గార్డెనింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం సినీ సెలబ్రిటీలు, సామాన్యులు అందరూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఏదీ పడితే అది కొనేయాలనుకోవడం లేదు. ఆర్గానిక్ ఉత్తత్తులనే కొనడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందుకు ప్రత్యేక కారణాలంటూ చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పండించే పంటల్లో అధిక శాతం క్రిమిసంహారక మందులను అధిక మోతాదులో ఉపయోగించడమే. వీటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం పాడవడం ఖాయం.
సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే సురేశ్‌బాబులాంటి నిర్మాతలైతే స్వయంగా వ్యవసాయభూములు కోనుగోలు చేసి వాటిలో ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయించి పంటలను పండిస్తు్నారు. వాటినే ఆహారంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈయన జాబితాలోకి మరో స్టార్ హీరోయిన్ చేరింది. ఆమె ఎవరో కాదు.. సమంత అక్కినేని. రీసెంట్‌గా సమంత టెర్రస్ గార్డెనింగ్‌ను ప్రారంభించింది. ఈ గార్డెన్‌కు సంబంధించిన చిన్నపాటి వీడియోను సమంత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. సమంత టెర్రస్ గార్డెనింగ్ పద్ధతిని చూసిన వారందరూ ముచ్చటపడుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ఈ ఏడాది జానుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌లో టెర్రరిస్ట్ పాత్రలో నటించింది. ఇప్పుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com