సమంత టాక్ షో 'సామ్‌జామ్'
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత అక్కినేని సరికొత్త అడుగు వేశారు. ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమైన ఆమె కొత్త టర్న్ తీసుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఫుల్ టైమ్ హోస్ట్‌గా మారారు. తెలుగు ఓటీటీ యాప్ ఆహాలో ఓ టాక్‌షో ప్రసారం కానుంది. దీపావళి సందర్భంగా నవంబర్ 13 నుండి 'సామ్‌జామ్' అనే టాక్ షో ప్రసారం కానుంది. ఈ షోను సమంత అక్కినేని హోస్ట్ చేయబోతున్నారు. నార్మల్ టాక్‌షో స్టైల్లో కాకుండా సమాజంలో సమస్యను ప్రశ్నించేలా, టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేలా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ "సమంత హోస్ట్ చేస్తున్న 'సామ్‌జామ్' ఈ టాక్ షో విషయానికి వస్తే.. దీని పేరు 'సామ్ జామ్'. ఇది ఎంత పెద్ద షో అవుతుంది. దక్షిణాదిలోనే ఇంత పెద్ద షో జరగలేదని విషయం.. షో జరిగితే కానీ తెలియదు. ఇతర టాక్ షోలకు భిన్నమైన టాక్ షో ఇది. ఆహా మాధ్యమానికి ఇది తొలి మెట్టు. నందినీ రెడ్డి ఈ షోను తన భుజాలపై మోస్తున్నారు. ఇది కేవలం మా అవసరాల రిఫ్లెక్ట్ చేసే షో కాదు.. సమంత పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసే షోగా డిజైన్ చేశారు. ఇందులో సామాజిక కారణం, కొందరి జీవితాలను మార్చడానికి అవసరమైన విషయాలుంటాయనేలా ఈ షోను డిజైన్ చేశారు" అన్నారు.
డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ "నేను ఢీలాంటి రియాలిటీ షో చేశాను. కానీ పీసీఆర్ రూంలోకి ఇంత వరకు వెళ్లనే లేదు. కానీ తొలిసారి ఈ షో కోసం ఆ రూమ్‌లో కూర్చుకున్నాను. నేను ఎక్కువగా సినిమాలే చేశాను. కానీ ఈ షోను చేసేటప్పుడు చాలా సమస్యలు ఫేస్ చేశాను. యూనిక్ ఎక్స్‌పీరియెన్స్. సామ్ జామ్ టీం.. కంట్రీలోనే పెద్ద షోస్‌ను నిర్వహించారు. కాఫీ విత్ కరణ్, కౌన్‌బనేగా కరోడ్‌పతి వంటి షోస్ చేసిన టీమ్‌తో పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇదేదో టాక్‌షోనో, ఎంటర్టైన్మెంట్ షోనో కాదు.. అంతకంటే చాలా పెద్ద షో" అన్నారు.
స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మాట్లాడుతూ "చాలారోజుల తర్వాత ఇంట్లో ఇంత సమయం గడిపే సమయం దక్కింది. ప్రజలు చాలా సమస్యలు ఫేస్ చేశారు. కానీ ఎవరినీ తప్పు పట్టలేం. మనతో పాటు మన చుట్టు ఉన్నవాళ్లు, వాళ్ల ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఓ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ అనొచ్చు. సామ్‌జామ్ షో చాలా పెద్ద ఛాలెంజ్. దీంతో పోల్చితే యాక్టింగ్ చాలా సులభమనిపిస్తుంది. హోస్టింగ్ సులభం కాదు. నాకు ఓ ఎక్స్‌టెన్షన్‌లాంటి షో అని భావిస్తున్నాను. ఇది అందరికీ సంతోషాన్ని అందించే షో అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి సమయంలో ఈ షో చేయడం ముఖ్యమనిపించడంతో ఈ ఛాలెంజ్‌కు ఒప్పుకున్నాను. నేను బిగ్‌బాస్‌ను హోస్టింగ్ చేయడమనేది నాగ్ మామ నిర్ణయం. బిగ్‌బాస్‌ను సామ్‌జామ్ భిన్నమైంది. ఇక సామ్ జామ్ విషయానికి వస్తే మంచి టీం కుదిరింది. బిగ్‌బాస్ షో హోస్ట్ చేసే సమయంలో నాకు పెద్దగా నిద్ర పట్టలేదు. చాలా హార్డ్‌వర్క్ చేశాను. ఓ ఛాలెంజ్‌గా తీసుకుని హోస్ట్ చేశాను. సామ్ జామ్ విషయానికి వస్తే.. ఇది టాక్ షో కాదు, సమాజంలో సమస్యల గురించి మాట్లాడుతాం. టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తాం. అరవింద్గారితో కలిసి పనిచేయడం హ్యాపీగా, స్పెషల్‌గా అనిపిస్తుంది. నేను మాధ్యమం గురించి ఆలోచించలేదు. ఓ ఛాలెంజింగ్‌గా అనిపించడంతో షో చేయడానికి ఒప్పుకున్నాను" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com