రకుల్, సారా అలీఖాన్‌లకు మద్దతుగా సమంత..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత తోటి హీరోయిన్స్‌కు అండగా నిలిచింది. బాలీవుడ్లో డ్రగ్స్ కోణం బయటపడటమే కాకుండా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ పేరు బయటకు రావడంతో టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు చెలరేగాయి. మరింకెన్ని పేర్లు బయటకు వస్తాయోనని చర్చలు నడిచాయి. మరోవైపు ఈ కేసులో సారా అలీఖాన్ పేరు కూడా బయటకు వచ్చింది. కొందరు నెటిజన్స్ సారా, రకుల్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం గుప్పించారు.
సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయట పడటంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు సహా మరికొంత మందిని అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేర్లను రియా వెల్లడించినట్లు వార్తలు హల్చల్ చేశాయి. పూర్తి వివరాలు వెల్లడి కాకముందే నెటిజన్లు విమర్శనాస్త్రాలు ఎక్కపెట్టారు. దీంతో ఎన్సీబీ ఈ పుకార్లకు చెక్ పెట్టింది.
డ్రగ్స్ కేసు విషయమై ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా స్పందించారు. మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ముఠా వివరాలను సేకరించామన్నారు. అయితే బాలీవుడ్ ప్రముఖుల జాబితాను మాత్రం సిద్ధం చేసుకోలేదన్నారు. కానీ అందరూ దాన్ని బాలీవుడ్ ప్రముఖుల లిస్టుగా అపార్థం చేసుకున్నారని మల్హోత్రా తెలిపారు. లిస్టులో రకుల్, రియా పేర్లు ఉన్నట్లుగా వచ్చిన వార్తలను కొట్టి పడేశారు. డ్రగ్స్ వ్యవహారంతో సారా, రకుల్‌ల పేర్లు లేవని తెలియడంతో నెటిజన్స్ క్షమాపణలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరి పోస్ట్‌లను ఇన్‌స్టా స్టోరీస్‌లో సమంత షేర్ చేసి సారా అలీఖాన్, రకుల్‌కు మద్దతు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com