సమంతా నువ్వు ప్రెగ్నెంటా.. లేకపోతే నన్ను చేయమంటావా..!!
Send us your feedback to audioarticles@vaarta.com
అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో వుండేందుకు గాను సినీ తారలు సోషల్ మీడియాలో ఖాతాలు తెరుస్తున్నారు. వ్యక్తిగత వివరాలతో పాటు సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్ చేస్తూ వుంటారు. అలాగే తీరిక వేళల్లో ట్విట్టర్, ఫేస్‌బుక్ లైవ్‌ల ద్వారా ఇంటరాక్ట్ అవుతూ వుంటారు. అయితే కొందరి ఓవరాక్షన్ కారణంగా సెలబ్రెటీలు ఇబ్బందులు పడుతూ వుంటారు. తాజాగా సమంతా ఓ నెటిజన్ అడిగిన పిచ్చి ప్రశ్నకు షాకయ్యారు.. కానీ ఆ వెంటనే తేరుకుని అతగాడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సమంత ఫ్యాన్స్, నెటిజెన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇదే సమయంలో ఓ నెటిజెన్ ఆమెను దారుణమైన ప్రశ్న అడిగారు. సమంత మీరు ఇప్పటి వరకు తల్లి అయ్యారా? లేదంటే నేను తల్లిని చేస్తాను.. అంటూ అసభ్యకరమైన ప్రశ్న వేశాడు. తొలుత షాకైనా.. ఆ తర్వాత సామ్ సమయస్పూర్తితో వ్యవహరించారు. ముందు నువ్వు రీప్రొడ్యూస్ అనే పదాన్ని వాక్యంలో ఎలా ఉపయోగించాలో గూగుల్‌లో వెతికి నేర్చుకో... అంటూ కౌంటర్ వేసింది.
ఇకపోతే.. నాగచైతన్యతో విడాకులు .. ఆతర్వాత జరిగిన పరిణామాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతోన్న సమంత ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. ఆమె అనేక కొత్త ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో బిజీగా వున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న విడుదల చేశారు.
మైథలాజికల్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శకుంతలగా సమంత లుక్ అదిరిపోయింది. అలాగే సామ్ హీరోయిన్ గా యశోద టైటిల్ తో మరో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం రూ. 3 కోట్లతో ఖరీదైన సెట్స్ నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments