'మహానటి' లో సమంతకి నత్తి ఉందా?
Send us your feedback to audioarticles@vaarta.com
నటీమణి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ బయోపిక్‌లో నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత, షాలిని పాండే, మోహన్ బాబు, క్రిష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన టీజర్‌లో “అన్..గన్..నగ” అంటూ మొదలుపెట్టి ఆ తరువాత 'అనగనగా ఓ మహానటి' అంటూ ఓ డైలాగును చెప్పడాన్ని చూపించారు.
అంటే.. ఆ డైలాగ్ చెప్పిన పాత్రకి నత్తి ఉందనే సెన్స్ ఈ టీజర్‌లో కనిపించిందన్నమాట. అయితే ఈ డైలాగ్ కీర్తి చెప్పారా? లేక సమంత చెప్పారా? అనేది క్లారిటీగా తెలియలేదు. సావిత్రికైతే నత్తి ఉందని ఎక్కడా వినిపించలేదు. ఈ నేపథ్యంలో.. మహానటి సావిత్రి జీవిత కథను తెరపై ప్రేక్షకులకు సవివరంగా చెప్పేది జర్నలిస్ట్ మధురవాణి పాత్ర (సమంత) కావడంతో.. సమంత పాత్రకి నత్తి ఉందేమో అన్నది ఆసక్తికరంగా మారింది. మరి.. సమంత పాత్రకి నత్తి ఉందా? లేక స్పెషల్‌గా టీజర్ చూపించాలన్న ఉద్దేశంతో టీజర్‌ను అలా తీర్చిదిద్దారా? అనేది తెలియాలంటే మే 9 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments