వేసవి సందడి.. సమంతదే

  • IndiaGlitz, [Friday,February 16 2018]

గ‌త నాలుగేళ్ళుగా వేస‌విలో త‌న సినిమాల‌తో.. సమంత బాగానే సంద‌డి చేస్తోంది. ఇక ఈ ఏడాది కూడా ఆమె న‌టించిన‌ మూడు చిత్రాలు విడుదలకు సిద్ధం కాబోతున్నాయి. వీటిలో ముందుగా మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి' మార్చి 29న విడుదల కానుంది. నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో జర్నలిస్ట్ గా కనిపించనుంది సామ్. ఇక రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం' మార్చి 30న విడుదల కానుంది.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథలో పల్లెటూరి పిల్ల రామలక్ష్మిగా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో కనిపించనుంది సమంత . అంతేగాకుండా.. మూగ అమ్మాయిగా నటించిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే...తమిళ నటుడు విశాల్ నటించిన తమిళ అనువాద చిత్రం అభిమన్యుడు' (తమిళంలో ఇరుంబుతిరై')లో డాక్టర్ రతీదేవిగా నటించింది ఈ చెన్నై చిన్నది. పి.ఎస్.మిత్రన్ రూపొందించిన ఈ టెక్నో థ్రిల్లర్‌ను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు. ఇలా మూడు భిన్నమైన పాత్రలలో నటించిన ఈ మూడు చిత్రాలతో వేస‌విలో బాగానే సంద‌డి చేయ‌నుంది సామ్‌. మ‌రోవైపు కొత్త సినిమాల కు ఓకే చెప్ప‌డంలోనూ స‌మంత బిజీగా ఉంది.

More News

సుకుమార్.. ముచ్చటగా మూడోసారి

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా పరిచయమై 14 ఏళ్లు అవుతోంది.

నితిన్ జోడీగా రాశి ఖ‌న్నా?

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన 'తొలి ప్రేమ' సినిమా విజ‌యంతో మ‌రోసారి ప‌రిశ్ర‌మ దృష్టిలో ప‌డింది ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ సినిమాలో వ‌ర్ష పాత్ర‌లో యువ‌త‌రాన్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ‌ని..తాజాగా ఓ మంచి అవ‌కాశం వ‌రించింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

వరుణ్ మెగా కుటుంబం గర్వపడే సినిమా చేశాడు: మెగాస్టార్ చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన 'తొలిప్రేమ'

'చెన్నై చిన్నోడు' ఆడియో లాంచ్

జి.వి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తూ సంగీతాన్ని సమకూర్చిన ఓ తమిళ చిత్రాన్ని 'చెన్నైచిన్నోడు'

సుమంత్ కొత్త సినిమా టైటిల్

చాలా కాలం గ్యాప్ తర్వాత 'మళ్ళీరావా' సినిమాతో విజయాన్ని అందుకున్నారు సుమంత్.