మాతృత్వంపై నెటిజన్ ప్రశ్న.. సమంత షాకింగ్ సమాధానం
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లైన అమ్మాయిని కొన్ని రోజుల తర్వాత దగ్గరివాళ్లు, బంధువులు, స్నేహితులు అడిగే ప్రశ్నల్లో మొదటిది తల్లిగా ఎప్పుడు మారుతున్నావ్? అని. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలైన హీరోయిన్స్‌కు కూడా ఈ ప్రశ్న తప్పదు. అలాంటి ప్రశ్నే స్టార్ హీరోయిన్ సమంతకు ఎదురైంది. అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమంతను ఓ నెటిజన్ `మీ చిన్నారి ఎప్పుడు వస్తాడు?` అంటూ నేరుగా ప్రశ్నించాడు. దీనిపై సమంత ఎలా స్పందిస్తుందోనని నెటిజన్లు భావించారు. అయితే ఆమె దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.
``నా శరీరంలో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2022లో ఆగస్ట్ 7వ తేది ఏడు గంటకు నేను ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాను`` అని రిప్లయ్ ఇచ్చారు సమంత. మరి సమంత తన మాతృత్వం గురించి ఎదురవుతున్న ప్రశ్నకు ఇంత వ్యగ్యంగా సమాధానం ఇచ్చినట్లుందని ఆ సమాధానం చూసిన వారు అనుకుంటున్నారు.
సమంత రీసెంట్గా తమిళ చిత్రం `96` తెలుగు రీమేక్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మరో కొత్త సినిమాను ఒప్పుకోలేదు. అయితే బాలీవుడ్ వెబ్‌సిరీస్ `ది ఫ్యామిలీ మ్యాన్` సీజన్ 2 `ది ఫ్యామిలీ మ్యాన్ 2`లో నటిస్తుంది. ఇందులో సమంత ఓ తీవ్రవాది పాత్రలో నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com