మాతృత్వంపై నెటిజ‌న్ ప్ర‌శ్న‌.. స‌మంత షాకింగ్ స‌మాధానం

  • IndiaGlitz, [Tuesday,November 19 2019]

పెళ్లైన అమ్మాయిని కొన్ని రోజుల త‌ర్వాత ద‌గ్గ‌రివాళ్లు, బంధువులు, స్నేహితులు అడిగే ప్ర‌శ్న‌ల్లో మొద‌టిది త‌ల్లిగా ఎప్పుడు మారుతున్నావ్‌? అని. ముఖ్యంగా సినిమా సెల‌బ్రిటీలైన హీరోయిన్స్‌కు కూడా ఈ ప్ర‌శ్న త‌ప్ప‌దు. అలాంటి ప్ర‌శ్నే స్టార్ హీరోయిన్ స‌మంత‌కు ఎదురైంది. అక్కినేని నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకున్న స‌మంత‌ను ఓ నెటిజ‌న్ 'మీ చిన్నారి ఎప్పుడు వ‌స్తాడు?' అంటూ నేరుగా ప్ర‌శ్నించాడు. దీనిపై స‌మంత ఎలా స్పందిస్తుందోన‌ని నెటిజ‌న్లు భావించారు. అయితే ఆమె దాన్ని సీరియ‌స్‌గా తీసుకోలేదు.

''నా శ‌రీరంలో ఆస‌క్తిక‌ర‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2022లో ఆగ‌స్ట్ 7వ తేది ఏడు గంట‌కు నేను ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నాను'' అని రిప్ల‌య్ ఇచ్చారు స‌మంత‌. మరి స‌మంత త‌న మాతృత్వం గురించి ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌కు ఇంత వ్య‌గ్యంగా స‌మాధానం ఇచ్చిన‌ట్లుంద‌ని ఆ స‌మాధానం చూసిన వారు అనుకుంటున్నారు.

స‌మంత రీసెంట్‌గా త‌మిళ చిత్రం '96' తెలుగు రీమేక్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. మ‌రో కొత్త సినిమాను ఒప్పుకోలేదు. అయితే బాలీవుడ్ వెబ్‌సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్‌' సీజ‌న్ 2 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో న‌టిస్తుంది. ఇందులో స‌మంత ఓ తీవ్ర‌వాది పాత్ర‌లో న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ విష‌యంలో ఓ క్లారిటీ రానుంది.