షాకిస్తున్న స‌మంత రెమ్యున‌రేష‌న్‌

  • IndiaGlitz, [Wednesday,April 24 2019]

గ‌త ఏడాది రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, అభిమ‌న్యుడు చిత్రాల స‌క్సెస్‌లో త‌న వంతు పాత్ర పోషించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంది స‌మంత‌. ఈ ఏడాది కూడా గెలుపును కంటిన్యూ చేస్తుంది. ఈ ఏడాది త‌మిళంలో విడుద‌లైన 'సూప‌ర్ డీల‌క్స్‌' చిత్రంలో వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టించి అంద‌రి దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకుంది స‌మంత‌. అలాగే రీసెంట్‌గా విడుద‌లైన 'మ‌జిలీ'తో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకుంది.

ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల‌కు స‌మంత ఆప్ష‌న్‌గా క‌న‌ప‌డుతుంది. ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌మంత కోసం పాత్ర‌ల‌ను వైవిధ్యంగా డిజైన్ చేస్తున్నారు. అయితే స‌మంత త‌న రెమ్యున‌రేష‌న్ కూడా భారీగా పెంచేసింద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. విన‌ప‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం స‌మంత మూడు కోట్లు వ‌ర‌కు డిమాండ్ చేస్తుంద‌ట‌. స‌మంత షాకింగ్ రెమ్యున‌రేష‌న్ చెబుతున్నా కూడా అంత భారీ మొత్తాన్ని నిర్మాత‌లు ఆమెకు ఇవ్వ‌డానికి సిద్ధంగానే ఉన్నారు.