ఫొటో షేర్ చేసి డిలీట్ చేసిన సామ్..
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత అక్కినేని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సమంత తన వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలను తెలియజేసేలా ఫొటోలను షేర్ చేస్తుంది. అంతే కాకుండా తన ఫేవరేట్ డాగ్‌తో, ఇతర స్నేహితురాళ్లతో ఉన్నఅనుబంధాన్ని తెలియజేసే ఫొటోలను కూడా సమంత షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో సమంత ఈరోజు తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటో అక్కినేని అభిమానులు భగ్గుమన్నారు. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. సమంత ప్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్న ప్రీతమ్ జుకల్కర్ ఒడిలో కాళ్లు పెట్టుకుని పడుకుంది. నాలుగేళ్లుగా ప్రీతమ్ సమంతతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. అందుకు గుర్తుగా తనతో ఉన్న ఫొటోను షేర్ చేసిన సమంత ఐలవ్ యూ అంటూ మెసేజ్‌ను కూడా పోస్ట్ చేశారు.
అయితే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, అలాంటి ఫొటోను సమంత షేర్ చేయడం అభిమానులకు నచ్చలేదు. దీంతో వారు తమదైన శైలిలో విమర్శలు మొదలు పెట్టారు. దీంతో సమంత వెంటనే ఆ ఫొటోను డిలీట్ చేసేసింది. ఓ బేబీ వంటి సూపర్‌హిట్ తర్వాత మరో సినిమాలో నటించని సమంత సామ్‌జామ్ టాక్‌షోతో ప్రేక్షకులను పలకరించింది. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందబోయే శాకుంతలం సినిమాలో శకుంతల పాత్రలో నటించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com