అందరి నోట ఒక్కటే మాట.. వెంకటేష్ అదుర్స్.. సమంత ఫిదా!

  • IndiaGlitz, [Wednesday,July 21 2021]

విక్టరీ వెంకటేష్ సినిమా అంటే దర్శకులకు సగం పని పూర్తయినట్లే. ఏ సన్నివేశంలో ఎలాంటి హావభావాలు పండించాలో వెంకటేష్ చూసుకుంటాడు. మరోసారి అది నారప్ప చిత్రంతో ప్రూవ్ అయింది. వెంకటేష్ విభిన్నమైన వేరియేషన్స్ పండిస్తూ నారప్ప చిత్రంలో అలరించాడు. ఫిలిం క్రిటిక్స్ ఈ చిత్రాన్ని వెంకీ షోగా అభివర్ణిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎన్టీఆర్ తప్పించుకోవడానికే, చరణ్ లుక్ పై నో కామెంట్.. ఆఫ్రికా అడవుల్లో మహేష్

సినిమాకు ఒరిజినల్ వర్షన్ తో పోలికలు పెడుతున్నప్పటికీ వెంకీ పెర్ఫామెన్స్ మాత్రం అదరగొట్టేసినట్లు ప్రేక్షకులు సైతం చెబుతున్నారు. అక్కినేని కోడలు సమంత సైతం వెంకీ పెర్ఫామెన్స్ కు ఫిదా అయింది. సోషల్ మీడియాలో సమంత వెంకటేష్ పెర్ఫామెన్స్ గురించి పోస్ట్ పెట్టింది.

ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో 'వెంకటేష్.. వావ్.. వావ్' అంటూ ఫైరీ ఎమోజిలు పెట్టింది. నారప్ప చిత్రంలో వెంకీ పల్లెటూరి వ్యక్తిగా గుబురు గడ్డంతో కనిపించాడు. వెంకీ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దానికి తోడు వెంకీ నటన అదరగొట్టేశాడు. రాయలసీమ యాసలో వెంకీ డైలాగులు, యాక్షన్ సీన్లు మెప్పించాయి.

తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ చిత్రానికి రీమేక్ గా నారప్ప తెరకెక్కింది. కొత్త బంగారు లోకం ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు. మణిశర్మ సంగీతం అందించారు. ప్రియమణి ఫిమేల్ లీడ్ గా ఈ చిత్రంలో నటించింది. కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల, నాజర్, రావు రమేష్ ఇతర పాత్రల్లో నటించారు. జూలై 20న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది.