ఆ...అవకాశం రావడం అవార్డ్ కంటే ఎక్కువ - సమంత
- IndiaGlitz, [Friday,May 13 2016]
సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్నభారీ చిత్రం బ్రహ్మోత్సవం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న బ్రహ్మోత్సవం చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత నటించారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన బ్రహ్మోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 20న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవం గురించి హీరోయిన్ సమంత తో ఇంటర్ వ్యూ మీకోసం...
బ్రహ్మోత్సవం చిత్రంలో సీనియర్ నటీనటులతో వర్క్ చేసారు కదా..? ఏమైనా నేర్చుకున్నారా..?
జయసుధ, రేవతి, శరణ్య మేడమ్స్ తో వర్క్ చేయడం మరచిపోలేని అనుభూతి. శరణ్య మేడమ్ ఓ విషయం చెప్పారు. అది ఏమిటంటే...ఆమె నటించేటప్పడు ప్రతిసారీ ఈ సీన్ నేను చేయగలనా..? అని భయపడుతుంటారట. జాతీయ అవార్డ్ సొంతం చేసుకున్న శరణ్య మేడమ్ నటనని ఇంతగా ప్రేమిస్తారా అనిపించింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి శరణ్య మేడమ్ ఇన్ స్పిరేషన్ తో మరింత బాగా నటించాలి..ప్రతి సీన్ ఫస్ట్ సీన్ లా..ప్రతి సినిమా ఫస్ట్ సినిమాలా భావించి వర్క్ చేయాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను.
బ్రహ్మోత్సవం సినిమా ఆడియోన్స్ కి ఎలాంటి అనుభూతి కలిగిస్తుంది..?
బ్రుహ్మోత్సవం ఒక ఉత్సవం లాంటి సినిమా. శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ అంతా కలసి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. బంధాలు - అనుబంధాల ప్రాముఖ్యతను తెలియచేసే సినిమా ఇది. ఒక మంచి సినిమాని చూసామనే అనుభూతి కలిగిస్తుంది.
దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మళ్లీ మహేష్ తో వర్క్ చేసారు కదా..ఎలా ఫీలవుతున్నారు..?
స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ తో మళ్లీ మళ్లీ వర్క్ చేసే అవకాశం రావడం అంటే చాలా గొప్ప విషయం. చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అయినా నాకు అవకాశం రావడం అంటే అదృష్టంగా భావిస్తాను. అలాగే మహేష్ తో మళ్లీ మళ్లీ వర్క్ చేసే అవకాశం రావడం అవార్డ్ రావడం కంటే ఎక్కువ అని నా ఫీలింగ్.
ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది..?
నా పాత్రను శ్రీకాంత్ గారు చాలా బాగా డిజైన్ చేసారు. తెలివైన అమ్మాయిగా కనిపిస్తాను. నా పాత్ర అందర్నీ ఆకట్టుకుంటుంది. ఒక మంచి చిత్రంలో..ఒక మంచి పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉంది.
కాజల్, ప్రణీత లతో కలసి నటించారు కదా..? ఏమైనా ఇబ్బందిగా ఫీలయ్యారా..?
బ్రహ్మోత్సవం అనేది చాలా మంది ఆర్టిస్టులతో రూపొందిన సినిమా. ఇంకా చెప్పాలంటే ఓ మల్టీస్టారర్...ఈ కథలో మేమందరం పాత్రధారులం. అయితే ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంది. అందుచేత నాకు ఎవరితోను ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఈ సినిమాలో బాలా త్రిపురమణి అనే సాంగ్ చాలా ఇష్టం. ఈ పాట నాది కాదు అని పొగడకుండా ఉండడం లేదు కదా...(నవ్వుతూ...) దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు...నేను ఇబ్బంది ఫీలయ్యానా..? లేదా అనేది.
బ్రహ్మోత్సవంకు ప్లస్ పాయింట్ ఏమిటి..?
మహేష్, శ్రీకాంత్ అడ్డాల...ఇవన్నీ పక్కన పెడితే...ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. హరిద్వార్, ఉదయ్ పూర్..ఇలా కంఫర్ట్ గా లేని ప్రదేశాల్లో కూడా షూటింగ్ చేసాం. అక్కడ చిత్రీకరించిన సన్నివేశాలను కూడా అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే తోట తరణి గారి సెట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రత్నవేలు, తోట తరణి గార్లు తో వర్క్ చేసే అవకాశం కల్పించిన మహేష్, శ్రీకాంత్ అడ్డాల, పి.వి.పి కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.
బ్రహ్మోత్సవం తమిళ ఆడియోన్స్ కూడా నచ్చుతుందా..?
ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి...ఇంతకు ముందు చెప్పినట్టుగా బంధాలు - అనుబంధాలు గురించి తీసిన సినిమా బ్రహ్మోత్సవం. అందుచేత తెలుగు, తమిళ్ అనే భాషా భేదం లేకుండా బ్రహ్మోత్సవం అందరికీ నచ్చుతుంది.