నటించడం మానేస్తే ఆయనే ఎక్కువ బాధపడతారు - సమంత..!

  • IndiaGlitz, [Saturday,December 10 2016]

నాగ చైత‌న్య - స‌మంత త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే. అయితే...పెళ్లి త‌ర్వాత స‌మంత న‌టిస్తుందా..? లేదా..? అనేదే ప్ర‌శ్న‌. ఈ విష‌యం గురించి నాగ చైత‌న్య ను అడిగితే...నాక‌న్నా ఎక్కువ సినిమాల్లో స‌మంతే న‌టిస్తుంది అని చెప్పాడు. అయిన‌ప్ప‌టికీ పెళ్లి త‌ర్వాత స‌మంత న‌టిస్తుంది అనే విష‌యం పై చాలా మందికి అనుమానం అలాగే ఉంది. చైత‌న్య‌తో స‌మంత పెళ్ళి అనే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి స‌మంత‌కు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.
కార‌ణం ఏమిటి అని స‌మంత‌ని అడిగితే...స‌మంత నాగార్జున కోడలు. ఆమెతో ఎలా ప‌ని చేయ‌గ‌లం అని నిర్మాత‌లు అనుకుంటున్నారు. నేను పెళ్లి త‌ర్వాత న‌టించ‌డం మానేస్తే ఆయ‌నే (నాగార్జున‌) ఎక్కువ బాధ‌ప‌డ‌తారు. అందుచేత పెళ్లి త‌ర్వాత న‌టించ‌డం మాన‌ను. ఇత‌రుల గురించి నాకు తెలియ‌దు కానీ...నేను మాత్రం పెళ్లి త‌ర్వాత కూడా న‌టిస్తాను అంటోంది స‌మంత‌.

More News

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌నతా గ్యారేజ్ త‌ర్వాత చేయ‌బోయే సినిమాను ఎట్ట‌కేల‌కు ఎనౌన్స్ చేసారు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా అంటూ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే.

వైభవంగా అఖిల్ అక్కినేని నిశ్చితార్థ వేడుక...

అక్కినేని నాగేశ్వరరావు మనవడు,నాగార్జున తనయుడు అఖిల్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

రవితేజతో మహాలక్ష్మి

హను రాఘవపూడి కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంలో మహాలక్ష్మిగా పరిచయమైన పంజాబీ భామ మెహరీన్ ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలతో బిజీ అవుతుంది.

శర్వా 'మహానుభావుడు'

రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్రాజా, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రాలతో సక్సెస్ మీదున్న శర్వానంద్ ఇప్పుడు దిల్రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో` శతమానం భవతి` చిత్రంలో నటించాడు.

నాలుగోసారి జత కడుతున్న హిట్ జోడి....

తెలుగు స్క్రీన్ పై హిట్ జోడిలు చాలానే ఉన్నాయి.అది డైరెక్టర్ హీరో,హీరోయిన్ ఎవరైనా కావచ్చు.