నటించడం మానేస్తే ఆయనే ఎక్కువ బాధపడతారు - సమంత..!
Saturday, December 10, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ చైతన్య - సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే...పెళ్లి తర్వాత సమంత నటిస్తుందా..? లేదా..? అనేదే ప్రశ్న. ఈ విషయం గురించి నాగ చైతన్య ను అడిగితే...నాకన్నా ఎక్కువ సినిమాల్లో సమంతే నటిస్తుంది అని చెప్పాడు. అయినప్పటికీ పెళ్లి తర్వాత సమంత నటిస్తుంది అనే విషయం పై చాలా మందికి అనుమానం అలాగే ఉంది. చైతన్యతో సమంత పెళ్ళి అనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సమంతకు అవకాశాలు తగ్గిపోయాయి.
కారణం ఏమిటి అని సమంతని అడిగితే...సమంత నాగార్జున కోడలు. ఆమెతో ఎలా పని చేయగలం అని నిర్మాతలు అనుకుంటున్నారు. నేను పెళ్లి తర్వాత నటించడం మానేస్తే ఆయనే (నాగార్జున) ఎక్కువ బాధపడతారు. అందుచేత పెళ్లి తర్వాత నటించడం మానను. ఇతరుల గురించి నాకు తెలియదు కానీ...నేను మాత్రం పెళ్లి తర్వాత కూడా నటిస్తాను అంటోంది సమంత.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments