రొమాంటిక్ హీరో అంటున్న సమంత...
Send us your feedback to audioarticles@vaarta.com
జూన్ 2న అనసూయ రామలింగంగా నితిన్ తో సందడి చేయడానికి సిద్ధమవుతున్న సమంత సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఓ విషయాన్ని చెప్పుకొచ్చింది. నితిన్ తో మొదటిసారి నటించారు కదా..తనతో చేయడం ఎలా అనిపించిందని అడిగితే నితిన్ చూడటానికి చాలా కామ్ గా కనపడుతున్నాడని, సినిమా విషయానికి వస్తే తను రొమాంటిక్ హీరో అని చెప్పుకొచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రెడీ అయ్యింది. డైలాగ్స్ తో, డైరెక్షన్ తో త్రివిక్రమ్ ఎలాంటి నవ్వులు పువ్వులు పూయించనున్నాడో మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout