అ ఆ ఇప్పటి వరకు రాని కొత్త కథ కాదు..సింపుల్ ఫీల్ గుడ్ ఫిల్మ్ - సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై...తొలి ప్రయత్నంలో అందర్ని ఆకట్టుకున్న అందాల బొమ్మ సమంత. ఏమాయ చేసావే తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు...ఇలా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇటీవల 24, బ్రహ్మోత్సవం..చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత తాజాగా అ ఆ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. నితిన్ - సమంత జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అ ఆ జూన్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా అ ఆ గురించి హీరోయిన్ సమంత తో ఇంటర్ వ్యూ మీకోసం...
అ ఆ లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
ఇప్పటి వరకు సెంటిమెంట్ రోల్స్, సీరియస్ రోల్స్ చేసాను కానీ...కామెడీ రోల్ చేయలేదు. ఫస్ట్ టైమ్ ఈ చిత్రంలో కామెడీ రోల్ చేసాను. నాకు కమెడియన్స్ అంటే చాలా గౌరవం. ఈ చిత్రంలో కామెడీ రోల్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నా పాత్రకు న్యాయం చేసాను అనుకుంటున్నాను. అలాగే నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.
అ ఆ కథ ఏమిటి..?
ఇదేదో ఇప్పటి వరకు రాని కొత్త కథ కాదు. సింపుల్ గా ఉండే ఫీల్ గుడ్ ఫిల్మ్. అయితే కథ కొత్తది కాకపోయినా....కథనం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది.ఇక త్రివిక్రమ్ గారి డైలాగ్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డైలాగులు చాలా కొత్తగాను.. అర్ధవంతంగా ఉంటాయి.
అ ఆ ఆడియో వేడుకలో త్రివిక్రమ్..ఈ కథ హీరో ఓరియంటెడా..? లేక హీరోయిన్ ఓరియంటెడా అని ఆలోచించకుండా నితిన్ అంగీకరించాడు అన్నారు..? దీనిని బట్టి అ ఆ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అనిపిస్తుంది నిజమేనా..?
త్రివిక్రమ్ గారు...ఎప్పుడూ అ ఆ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పలేదు. ఈ చిత్రానికి స్ర్కిప్టే హీరో.
స్ర్కిప్ట్ హీరో అని అంటున్నారు కదా...మీ క్యారెక్టర్, అనుపమ క్యారెక్టర్ నితిన్ క్యారెక్టర్ ని డామినేట్ చేస్తాయా..?
ఈ చిత్రంలో్ హీరో, హీరోయిన్స్ కి అలాగే మిగిలిన క్యారెక్టర్స్ కి అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ మిగిలిన క్యారెక్టర్ ని డామినేట్ చేయడం అనేది ఉండదు.
అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, ఇప్పుడు అ ఆ. త్రివిక్రమ్ తో కలిసి మూడు సినిమాలు చేసారు కదా..త్రివిక్రమ్ మీకు మూడు సినిమాల్లో అవకాశం ఇవ్వడానికి కారణం ఏమిటి..?
ఈ విషయాన్ని మీరు త్రివిక్రమ్ గార్నిఅడిగితే బాగుంటుంది (నవ్వుతూ..) త్రివిక్రమ్ గారే కాకుండా గౌతమ్ మీనన్, విక్రమ్ కుమార్ కూడా ఒకసారి వాళ్లతో వర్క్ చేసిన తర్వాత మళ్లీ మళ్లీ నాకు అవకాశాలు ఇచ్చారు. నా పాత్రకు న్యాయం చేయాలని కష్టపడతాను. బహుశా నా వర్కింగ్ స్టైల్ నచ్చే మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తున్నారేమో..!
అనుపమ క్యారెక్టర్ కి మీ క్యారెక్టర్ కి తేడా ఏమిటి..?
మా ఇద్దరి క్యారెక్టర్స్ మధ్య చాలా తేడా ఉంది. అనుపమ విలేజ్ గాళ్ గా నటిస్తే...నేను సిటీలో ఉండే అమ్మాయిగా నటించాను. అయితే..మా ఇద్దరి క్యారెక్టర్స్ లో ఉన్న కామన్ పాయింట్ ఏమిటంటే...ఏదైనా సమస్య వస్తే..దాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కొంటాం.
నితిన్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేసారు కదా..వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?
నితిన్ నాకు మంచి ఫ్రెండ్. అయితే...ఫ్రెండ్ కావడం వలన ఫస్ట్ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరడానికి కొంత టైమ్ పట్టింది. ఆ టైమ్ లో త్రివిక్రమ్ గారు మిమ్మల్ని అనవసరంగా కలిపానా అన్నారు (సరదాగా...). ఆతర్వాత మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. అది సినిమా అవుట్ పుట్ బాగా రావడానికి ఎంతగానో ఉపయోగపడింది. నితిన్ ఒక్కడే కాదు...ఈ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా నాకు మంచి ఫ్రెండ్స్. అందుచేత ఈ సినిమా హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ..ఈ మూడు చిత్రాల్లో మీరు సెకండ్ హీరోయిన్ గానే నటించారు కదా..దీనిపై కామెంట్ ఏమిటి..?
ఫస్ట్ హీరోయినా...సెకండ్ హీరోయినా అని నేను చూడను. నా క్యారెక్టర్ ఎలా ఉంది అనేదే చూస్తాను. ఈ మూడు చిత్రాల్లో నా క్యారెక్టర్ నచ్చింది కాబట్టే నటించాను.
ఇటీవల ఎన్టీఆర్ అతి క్లిష్టమైన డ్యాన్స్ ర్ అని అన్నారు కదా కారణం ఏమిటి..?
ఎన్టీఆర్ ఏ స్టెప్ వేయాలన్నా సరే....రిహార్సల్ చేయకుండానే డ్యాన్స్ చేసేస్తారు. మేము డ్యాన్స్ చేయాలంటే రిహార్సల్స్ చేయాల్సిందే. కానీ ఎన్టీఆర్ కి రిహార్సల్స్ అవసరం లేదు అందుకే అలా అన్నాను.
బ్రహ్మోత్సవం రిజల్ట్ గురించి మీ కామెంట్ ఏమిటి..?
నేను హిట్, ఫ్లాప్స్ గురించి పట్టించుకుంటాను. హిట్ వస్తే ఎంత ఆనందపడతానో...ఫ్లాప్ వస్తే అంతే బాధపడతాను. అయితే హిట్ - ఫ్లాప్ అనేది మన చేతుల్లో ఉండదు. ఆడియోన్స్ చేతుల్లో ఉంటుంది. బ్రహ్మోత్సవం ఆశించిన రిజల్ట్ ఇవ్వలేకపోయింది.
తదుపరి చిత్రాల గురించి..?
యు టర్న్ రీమేక్ లో నటిస్తున్నాను. అలాగే ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout