Samantha:సమంత సంచలన నిర్ణయం : సినిమాలకు బ్రేక్ , శాశ్వతంగానా.. టెంపరరీనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు అగ్ర కథానాయిక సమంత. నాగచైతన్యతో విడాకుల తర్వాత కొన్నాళ్లు సినిమాకు గ్యాప్ ఇచ్చిన సమంత.. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యారు. ఈ క్రమంలో మయోసైటిస్ బారినపడినా మొక్కవోని ధైర్యంతో దానిని అధిగమించారు. గతంలో తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్‌లను ఒక్కొక్కొటిగా పూర్తి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమంత సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం సినిమాలకు బ్రేక్ చెప్పాలని సామ్ ఫిక్స్ అయ్యారట.
నిర్మాతలకు అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేస్తోన్న సామ్ :
చేతిలో వున్న సినిమాలు తప్పించి.. ఇకపై ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొద్దని సమంత నిర్ణయం తీసుకున్నారట. ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ సమయంలో తన హెల్త్, పర్సనల్ లైఫ్‌పై దృష్టి పెట్టాలని సమంత నిర్ణయించారట. కొత్త సినిమాల కోసం నిర్మాతల వద్ద నుంచి తీసుకున్న అడ్వాన్స్‌లను తిరిగి ఇచ్చేస్తూ వుండటంతో సామ్ శాశ్వతంగా సినిమాలు చేయదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇది టెంపరరీ బ్రేక్ మాత్రమేనని.. ఏడాది తర్వాత ఖచ్చితంగా సమంత సినిమాల్లో నటిస్తారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి తన నిర్ణయంతో సినీ ప్రముఖులు, ప్రేక్షకులకు సమంత షాకిచ్చిందనే చెప్పాలి.
ఇకపై ఆరోగ్యంపైనే దృష్టి :
అయితే ప్రధానంగా ఆరోగ్య సమస్యల కారణంగా సమంత సినిమాలకు బ్రేక్ చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా ఫిలింనగర్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. మయోసైటిస్కు చికిత్స తీసుకుంటూనే యశోద, శాకుంతలం వంటి సినిమాలను సామ్ పూర్తి చేశారు. యశోద మూవీ కోసం పక్కన సెలైన్ బాటిల్ పెట్టుకుని డబ్బింగ్ చెబుతున్న ఫోటో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే . అందుకే పూర్తి ఆరోగ్యాన్ని సంపాదించాలనే సామ్ ఈ బ్రేక్ చెప్పారట. ప్రస్తుతం సమంత సీటాడెల్ వెబ్ సిరీస్, విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments