పెళ్లి తర్వాత మళ్లీ జంటగా...
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని చైతన్య, సమంత జోడిని హిట్ పెయిర్ అంటారు. జయాపజయాలను పక్కన పెడితే.. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా ఇద్దరూ ఓ ఇంటివారయ్యారు.
పెళ్లికి ముందు.. 'ఏమాయ చేసావె', 'ఆటోనగర్ సూర్య', 'మనం' చిత్రాల్లో నటించారు. పెళ్లి తర్వాత సమంత సినిమాలకు దూరం కాలేదు. వరుస సినిమాలను చేస్తుంది. ఇప్పుడు భర్త నాగచైతన్యతో కలిసి నటించబోతుంది.
'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ప్రస్తుతం 'సవ్యసాచి', 'శైలజారెడ్డి' అల్లుడు సినిమాలో చైతన్య బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తి కాగానే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. పెళ్లి తర్వాత చైతన్య, సమంత కలిసి నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com