నన్ను ద్వేషించే వారికి ధన్యవాదాలు: సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని వారి కోడలు సమంత అక్కినేని లాక్‌డౌన్ వల్ల ఇంటికే పరిమితమయ్యారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంటూ వచ్చారు. శుక్రవారం తన అభిమానులతో ట్విట్టర్ ద్వారా ముచ్చటించారు సమంత. వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు...
లాక్‌డౌన్‌లో నేర్చుకున్న కొత్త విషయం ఏంటి?
మీకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే కల మీ ఇంట్లోనే ఉండొచ్చు. ప్రేమానురాగాలున్న కుటుంబంతో గడపటమే ఓ కల కావొచ్చు. ప్రతిసారి కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం పరిగెత్తాల్సిన అవసరం లేదు.
సెలబ్రిటీగా కష్టమనిపించే విషయమేంటి?
కొన్నిసార్లు మన గురించి మనకు తెలియని విషయాలు వినాల్సి వచ్చింది
లాక్‌డౌన్ విషయంలో చైతన్య కోసం వంట చేశారా?
అవును చేసి పెట్టాను. లాక్‌డౌన్ సమయంలో షక్‌షుకా(గుడ్లు, టొమాటో) వంటి నేర్చుకున్నాను.
ఫిట్‌నెస్ కోసం ఏం చేస్తున్నారు?
చైతన్య, నేను కలిసి వర్కవుట్ చేస్తుంటాం. నా కంటే చైతన్యనే ఎక్కువగా వర్కవుట్ చేస్తున్నారు. నేను కష్టపడుతున్నట్లు నటిస్తుంటాను. అప్పుడప్పుడు బలవంతంగానైనా ఉపవాసం చేస్తున్నాను. నేను బిర్యానీ రెండు రోజులకు ఓసారైనా తింటాను. అలాగే మామిడిపళ్లు.. స్పైసీ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకుంటాను. ఉపవాసం ఉంటే బావుంటుందని భావించి చేస్తున్నాను.
మీ అభిమానులు గురించి?
వాళ్లే నా బలం.. నా బలహీనత
మిమ్మల్ని ద్వేషించే వారి గురించి ?
పొగడ్తలు నన్ను సోమరిని చేస్తాయి. అదే విమర్శలు ఎదురైనప్పుడు నాలోని బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నన్ను ద్వేషించేవాళ్లు నాలో స్ఫూర్తి రగిలిస్తుంటారు. కాబట్టి వారిని నా ధన్యవాదాలు.
అక్కినేని అమల గురించి?
మంచి స్నేహితురాలు.. మంచి మార్గదర్శి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout