నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నా.. అయితే..: సమంత

  • IndiaGlitz, [Saturday,August 29 2020]

ఇటీవల, చాలా మంది సెలబ్రిటీలు తాము గర్బం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు సెలబ్రిటీలకు అభిమానుల నుంచి ఆసక్తికర ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా అక్కినేని వారి కోడలు సమంత తన అభిమానులతో ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక అభిమాని ‘మీరు ప్రెగ్నెంటా?’ అని అడిగారు. దీనికి సామ్ ఓ ఆసక్తికరమైన సమాధానాన్ని వెల్లడించింది. ‘నేను 2017 నుంచి ప్రెగ్నెంట్‌తో ఉన్నాను. అయితే ఈ బిడ్డ బయటకు రావడానికి ఇష్టం పడటం లేదనుకుంటా’ అని సమాధానమిచ్చింది. ఊహించని ఈ సమాధానం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

రెండు రోజుల క్రితం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. వారు ఈ వార్తను ప్రకటించిన వెంటనే, అభిమానులు, ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు. సమంత కూడా కోహ్లీ దంపతులను అభినందించిన వారిలో ఉంది. మలయాళ బిగ్ బాస్ ఫేమ్ పెర్లే మానీ కూడా తాను గర్భవతినని తెలియజేస్తూ బేబీ బంప్‌తో పిక్‌ను పోస్ట్ చేసింది. జి.వి.ప్రకాష్, స్నేహ ప్రసన్న ఇటీవల తమ పిల్లల ఫోటోలను పంచుకున్నారు.

ప్రస్తుతం సమంత చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. విగ్నేష్ శివన్‌ సినిమా ‘కాతు వాకులా రెండు కాదల్’, అశ్విన్ శరవణన్ సినిమాలో సమంత నటిస్తోంది. కాతు వాకులా రెండు కాదల్‌లో విజయ్ సేతుపతి, నయనతారతో సమంత స్ర్కీన్‌ షేర్ చేసుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే దర్శక నిర్మాతలు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.