సినిమా రేంజ్లో సమంత రెమ్యునరేషన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు వెండితెరపై స్టార్ ఇమేజ్ను తెచ్చుకున్న వారందరూ బుల్లితెరపై రియాలిటీ షోస్‌లలో, ప్రేక్షకాదరణ పొందుతున్న టీవీ షోస్‌లలోనూ నటిస్తున్నారు. ఇలా నటించడం వెనుక అర్థమేంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా ఇచ్చిపుచ్చుకునే వ్యవహరమే. డిజిటల్ మాధ్యమానికి చెందిన మేకర్స్ మరింత ఆదరణను రాబట్టుకోవడానికి దానికి స్టార్స్ హంగామాను యాడ్ చేయాలనుకుంటారు. అందుకు తగ్గట్లు స్టార్స్ చార్జ్ కూడా చేస్తారు. అయితే స్టార్స్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ వారు అడిగినంత చెల్లించడానికి రెఢీ అంటున్నారు. ఆ కోవలో స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని రీసెంట్గా సామ్ జామ్ అనే టాక్‌షో ద్వారా డిజిటల్ ఎంట్రీ చేశారు.
స్టార్ హీరోయిన్గా రాణిస్తూ కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న సమంత ఇప్పుడు ఈ షోకు ఎంత కలెక్ట్ చేస్తుందోనని అందరూ అనుకున్నారు. వివరాల మేరకు సమంత ఎపిసోడ్ రూ.15 లక్షలను తీసుకుంటుందట. మొత్తం 12 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారట. అంటే కోటి ఎనబై లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుతుంది. మరి ఈ మొత్తం ఎక్కవా తక్కవా? అంటే కొందరు సినిమా కంటే ఇదే బెటర్‌గా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇదే రెమ్యునరేషన్‌తో సినిమాలో యాక్ట్ చేయాలంటే సమంత 50-60 రోజల పాటు కాల్షీట్స్ కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పుడు చేస్తున్న టాక్ షో కోసం గట్టిగా పన్నెండు రోజుల పాటు సమయం కేటాయిస్తుందేమో. తక్కువ వర్కింగ్ డేస్‌లో ఎక్కువ రెమ్యునరేషన్స్ అందితే ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి స్టార్స్ ఎందుకు వద్దంటారు అని సినీ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments