సోషల్ మీడియాలో 'అక్కినేని' తొలగించిన సామ్.. అందుకోసమేనా!
Send us your feedback to audioarticles@vaarta.com
క్రేజీ హీరోయిన్ సమంత సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ సామ్ కి నేషనల్ వైడ్ క్రేజ్ తీసుకొచ్చింది. దీనితో సమంత తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది. సౌత్ లో పెళ్ళైన హీరోయిన్లలో ఈ రేంజ్ క్రేజ్ మెయింటైన్ చేయడం బహుశా సమంతకు మాత్రమే సాధ్యం ఏమో.
ఇక ప్రేమ వివాహం చేసుకున్న చైతు, సామ్ అన్యోన్యంగా జీవిస్తున్నారు. అక్కినేని కోడలిగా సమంత ఒదిగిపోయింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో సమంత అక్కినేని పేరు కొనసాగించిన సామ్ లేటెస్ట్ గా ట్రెండ్ మార్చినట్లు కనిపిస్తోంది. చేంజ్ కోసమో ట్రెండ్ కోసమో తెలియదు కానీ.. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో సమంత.. అక్కినేని అనే పదం తొలగించింది. సింపుల్ గా తన ప్రొఫైల్ నేమ్ 'S' అని పెట్టుకుంది.
దీనితో అక్కినేని ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. కానీ చాలా మంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ప్రొఫైల్ నేమ్స్ డిఫెరెంట్ గా పట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. సమంత కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు ఉంది.
ఏది ఏమైనా సామ్ సోషల్ మీడియాలో అక్కినేని తొలగించడం ఒక న్యూస్ గానే మారింది. ఫ్యాన్స్ దీని గురించి చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సమంత భారీ చిత్రాల్లో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'శాకుంతలం'లో సమంత లీడ్ రోల్ లో నటిస్తోంది. అలాగే ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'లో కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments