సమంత @ 1.5 కోట్లు
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత అక్కినేని 1.5 కోట్లు ఏంటి? ఏదేని సినిమాకు ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ అని అనుకుంటున్నారా? కాదండి.. సోషల్ మీడియాలో భాగమైన ఇన్‌స్టాలో సమంతను ఫాలో అవుతున్న వారి సంఖ్య. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత అక్కినేనిని ఫాలో అవుతున్న వారి సంఖ్య 15 మిలియన్స్‌కు చేరింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో తెలియజేసిన సామ్ ` ఇప్పుడు షూటింగ్‌ను పూర్తి చేశాను. ఇన్‌స్టాలో 15 మిలియన్స్ ఫాలోవర్స్‌తో నాకు సర్‌ప్రైజ్ వచ్చింది. లైకులు, కామెంట్స్‌తో నన్నెంతో ప్రోత్సహించిన ఇన్‌స్టాగ్రామ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. మీ వల్ల మరింత ఉన్నతంగా పనిచేయాలనే ఫీలింగ్ వచ్చింది. లవ్యూ యు ఆల్`` అని అన్నారు సమంత.
సమంత అక్కినేని.. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుంది. కానీ, గత ఏడాది ‘ఓ బేబి’ సక్సెస్ తర్వాత మరో సినిమాలో మాత్రం ఇంత వరకు నటించలేదు. ఓటీటీలో సామ్ జామ్ ప్రోగామ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. త్వరలోనే గుణశేఖర్ రూపొందిస్తోన్న హిస్టారికల్ మూవీ `శాకుంతలం`లో శకుంతల పాత్రలో నటించనుంది సమంత. ఈ చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో వైపు సమంత నటించిన వెబ్ సిరీస్ ది ప్యామిలీ మ్యాన్ 2 విడుదలకు సన్నద్ధమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com