ట్రోలింగ్స్‌పై స‌మంత ఆన్స‌ర్ ఇదే...

  • IndiaGlitz, [Wednesday,January 27 2021]

సినిమాల సంగ‌తేమో కానీ.. స‌మంత అక్కినేని మాత్రం సోష‌ల్ మీడియాలో చాలా బిజీ బిజీగా ఉంది. ఓ బేబీ త‌ర్వాత మ‌రో సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు స‌మంత న‌టించ‌లేదు. ఆమె చేయాల్సిన శాకుంత‌లం కూడా రీసెంట్‌గా ఓకే చేసింది. ఇది స్టార్ట్ కావ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. అయితే ఈలోపు స‌మంత సోష‌ల్ మీడియాలో బిజీగా ఉంటూ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది. రీసెంట్‌గా అభిమానుల‌తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించింది. అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నెంటికో ఆమె ఓపిక‌గా స‌మాధానం చెప్పింది. 2020లో రానా మిహీకా బ‌జాజ్ పెళ్లి త‌న‌కు గుర్తుండి పోయే విష‌య‌మ‌ని స‌మంత ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఆన్స‌ర్ ఇచ్చింది. అలాగే ఇర‌వై ఏళ్లలో మీ గురించి చెప్పిండి? అని అడిగిన ప్ర‌శ్న‌కు 'ఇంకా ఎద‌గాల‌ని తాప‌త్ర‌య‌ముండేది' అని సామ్ స‌మాధాన‌మిచ్చింది.

ఇక నెటిజ‌న్స్ చేసే ట్రోలింగ్‌ను ఎలా భావిస్తారు అని ప్ర‌శ్నిస్తే.. 'కెరీర్ ప్రారంభంలో ఒక‌రు న‌న్ను విమ‌ర్శిస్తే చాలా బాధ‌ప‌డేదాన్ని. ట్రోలింగ్ వ‌ల్ల ఎన్నో నిద్ర‌లు లేని రాత్రులు గ‌డిపాను. అయితే ఇప్పుడు ట్రోలింగ్స్‌ను చూస్తే న‌వ్వొస్తుంది. ఒక‌రు ట్రోలింగ్ చేసే స్థాయికి ఎదిగామ‌ని భావిస్తుంటాను'' అని స‌మాధాన‌మిచ్చింది స‌మంత అక్కినేని.

More News

తండ్రికే లీగల్ నోటీసులు పంపి షాక్ ఇచ్చిన హీరో విజయ్

కోలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన హీరో విజయ్‌కి మాస్‌లో ఉన్న ఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

సింగ‌రేణిలో ప్ర‌భాస్ ‘సలార్’ షూటింగ్

ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన త‌ర్వాత ఆయ‌న కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు.

త‌మ‌న్నాకు కోర్టు నోటీసులు

మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు కోర్టు నోటీసుల రూపంలో షాక్ త‌గిలింది. సాధార‌ణంగా వివాదాల‌కు దూరంగా ఉండే త‌మన్నా భాటియాకు కోర్టు నోటీసులు రావ‌డ‌మేంటి?

పవన్ సినీ రీ ఎంట్రీపై నాదెండ్ల ఆసక్తికరమైన వ్యాఖ్యలు

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమా పూర్తి చేసిన త‌ర్వాత జ‌న‌సేన పార్టీతో పూర్తిగా రాజ‌కీయాల‌కే ప‌రిమితం అయ్యారు.

ఢిల్లీ ఘటనపై కేంద్రం సీరియస్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన విధ్వంస ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది.