Samantha :మయోసైటిస్ చికిత్సకు రూ.25 కోట్లు.. ఆ హీరో సాయం చేశారా , సమంత ఏమన్నారంటే ..?
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు అగ్ర కథానాయిక సమంత. నాగచైతన్యతో విడాకుల తర్వాత కొన్నాళ్లు సినిమాకు గ్యాప్ ఇచ్చిన సమంత.. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యారు. ఈ క్రమంలో మయోసైటిస్ బారినపడినా మొక్కవోని ధైర్యంతో దానిని అధిగమించారు. గతంలో తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్‌లను ఒక్కొక్కొటిగా పూర్తి చేస్తున్నారు. ఈ మధ్య సినిమాలకు బ్రేక్ చెప్పి.. ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో ఆధ్యాత్మిక వాతావరణంలో సేదతీరుతున్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ సమక్షంలో యోగా, ధ్యానం వంటి సాధనలు చేస్తున్నారు.
సామ్ చికిత్సకు స్టార్ హీరో సాయం చేశాడంటూ వార్తలు :
ఈ క్రమంలో సమంతపై సోషల్ మీడియాలో పిచ్చి రాతలు మాత్రం ఆగడం లేదు. మయోసైటిస్ చికిత్స కోసం సమంత ఓ స్టార్ హీరో నుంచి రూ.25 కోట్లు సాయం తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమెకు హెల్ప్ చేసిన ఆ టాలీవుడ్ అగ్ర నటుడు ఎవరు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రకరకాల వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. విషయం పెద్దది అవుతుండటంతో సామ్ స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు.
నా సమస్యను నేనే పరిష్కరించుకోగలను :
మయోసైటిస్ చికిత్సకు రూ.25 కోట్లా.. ఎవరు మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు చెబుతున్న దానిలో చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుందంటూ సామ్ చురకలంటించారు. తన కెరీర్‌లో ఇన్నాళ్లు పనిచేసినందుకు జీతంగా రాళ్లూరప్పలు ఇవ్వలేదని తాను భావిస్తున్నా.. అందుకని నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను అంటూ సమంత క్లారిటీ ఇచ్చారు. మయోసైటిస్ కారణంగా ఎందరో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యలు తానే పరిష్కరించుకోగలనని, వేరే వాళ్ల నుంచి సాయం పొందాల్సిన అవసరం తనకు లేదంటూ సమంత కుండబద్ధలు కొట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments