డిసెంబర్ లో పెళ్లి గురించి స్పందించిన సమంత
- IndiaGlitz, [Friday,July 15 2016]
ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత. అనతి కాలంలోనే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న సమంత, నాగ చైతన్య మనసు దోచుకుందని..వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నవిషయం తెలిసిందే. అయితే...తాజాగా నాగచైతన్య, సమంత సెప్టెంబర్ లో ఎంగేజ్ మెంట్, డిసెంబర్ లో మ్యారేజ్ చేసుకోనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే.... ట్విట్టర్ లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన సమంతా...ఓ అభిమాని డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నారా..? అని అడగగా...లేదు అని సమాధానం చెప్పింది. సో...డిసెంబర్ లో సమంత మ్యారేజ్ లేనట్టే. అయితే...డిసెంబర్ కన్నా ముందే చేసుకోవచ్చు లేదా డిసెంబర్ తర్వాత అయినా చేసుకోవచ్చు. కాకపోతే... సమంత మ్యారేజ్ డిసెంబర్ లో మాత్రం కాదు అనేది కన్ ఫర్మ్.