ఆ సమస్యపై గొంతు విప్పుతున్న సమంత... స్పందిస్తారంటారా?
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత ఇప్పుడు ఓ సమస్య మీద గొంతు విప్పుతున్నారు. అదీ నిన్నా మొన్నటిదాకా బాలీవుడ్లో చాలా మంది మాట్లాడిన విషయమే. అడపాదడపా టాలీవుడ్‌లోనూ విన్న విషయమే. అయితే ఇప్పుడు సమంత లాంటి హీరోయిన్ మాట్లాడటం వల్ల ఫోకస్ పడుతోంది. సమంత ఈ విషయం గురించి ఇంత బాహాటంగా మాట్లాడుతారని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. తన ఇంట్లోనే మామ, భర్త, మరిది, బాబాయ్, కజిన్స్... ఇలా ఇంత మంది హీరోలను పెట్టుకుని కూడా సమంత అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటూ చాలా మంది నోళ్లు నొక్కుకుంటున్నారు.
మొన్ననే మహిళా దినోత్సవం వెళ్లింది. నిన్నటికి నిన్న మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో జగ్గీవాసుదేవ్ ఆశ్రమంలో సమంత తేలింది. అక్కడ గురుజీ సమంతను సరదాగా గిల్లుతూ ఆటపట్టించే వీడియో కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. అవన్నీ ఒక వైపు... సమంతకు ఇప్పుడు వస్తున్న పబ్లిసిటీ మరో వైపు. ఇంతకీ సమంతకు ఆ రేంజ్ పబ్లిసిటీ తెచ్చిపెట్టిన విషయం ఏంటనేగా మీ అనుమానం అదే చెబుతున్నా... పార్ ఈక్వాలిటీ గురించి సమంత మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలో నువ్వు ఎంత తోపు హీరోయిన్ అయినా, టాప్ త్రీలో ఉన్న హీరోయిన్ అయినా సరే, నీ పక్కన నటించే హీరో కన్నా పారితోషికం తక్కువే ఉంటుంది. నీ పక్కన నటించే హీరో టాప్ 20లో కూడా ఉండకపోయినా నీకు మాత్రం అతనికన్నా తక్కువే రెమ్యునరేషన్ ఉంటుంది. అది ఎందుకు అని ప్రశ్నిస్తే, వెంటనే ఆ హీరోయిన్ని ప్రాబ్లమాటిక్ హీరోయిన్ అని అనేస్తారు. అదే టాప్ 20లో కూడా లేని హీరో రెమ్యునరేషన్‌ని పెంచమని అడిగితే అవతలివాళ్లు కూల్‌గా రియాక్ట్ అవుతారు. ఇంత భేదం ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు అని సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఫ్యామిలీలో అంత మంది హీరోలను పెట్టుకుని ఈ బాస్ లేడీ ఇలా ఎందుకు కామెంట్ చేసిందా అంటూ సోషల్ మీడియాలో కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి కామెంట్లు చేసి ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాబ్ చేయడం సమంతకు కొత్తేం కాదని మరికొందరు లైట్ తీసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments