ఒక్కపూట భోజనంతోనే రెండు నెలలు .. రూ.500 కోసం ఆ పని: కంటతడి పెట్టిస్తోన్న సమంత ఫ్లాష్‌ బ్యాక్

  • IndiaGlitz, [Saturday,February 05 2022]

జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు.. ఇప్పుడు వెండితెర మీద స్టార్లుగా వెలుగొందుతున్న వారంతా ఒకప్పుడు తినేందుకు తిండి లేక అలమటించిన వారే. సినిమా ఛాన్సుల కోసం చెన్నై, హైదరాబాద్, ముంబైలలో చెప్పులు అరిగేలా తిరిగి కన్నీళ్లు మింగి బ్రతికిన వారే. కృషి , పట్టుదల, క్రమశిక్షణలతో అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఓ స్థాయికి వచ్చారు. ప్రతి ఒక్కరిది కన్నీటి వ్యధే. ఈ లిస్ట్‌లోకే వస్తారు సమంత.

ఇప్పుడు దక్షిణాదిలో అగ్ర కథానాయికగా.. కోట్లాది రూపాయల పారితోషికం అందుకుంటున్నారు సామ్. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఆమె ఫ్యాన్ బేస్ వుండటంతో సమంత ఎన్ని కోట్లు డిమాండ్ చేసినా ఇచ్చేందుకు నిర్మాతలు క్యూలో రెడీగా వుంటారు. అయితే ఈ స్థాయికి రావడం వెనుక తాను ఎన్నో కష్టాలను పడినట్లు వెల్లడించారు సామ్.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. చదువుల్లో ప్రతిభావంతురాలినే అయినా ఆర్ధిక కష్టాల కారణంగా పై చదువులు చదువుకునేందుకు తన దగ్గర డబ్బులు లేవని సమంత ఉద్వేగానికి గురయ్యారు. అందుకే బాగా చదువుకోవాలనే కోరికతో ఫంక్షన్లు జరిగేటప్పుడు గేట్ దగ్గర వెల్‌కమ్ చెప్పే అమ్మాయిగా పనిచేశానని.. అందుకు తనకు రూ.500 ఇచ్చేవారని సమంత తెలిపారు. తన చేతిలో డబ్బులు లేనప్పుడు ఒక్కపూటే భోజనం చేసిన రోజులున్నాయని సామ్ ఎమోషనల్‌ అయ్యారు. ఒంటిపూట భోజనంతోనే రెండేసి నెలలు గడిపేశానని.. ఖర్చలు కోసం మోడలింగ్ కూడా చేసినట్లు గుర్తుచేసుకున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం మరిచిపోలేనని సమంత చెప్పారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ‘‘య‌శోద’’ వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో సమంత ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే జాన్ పిలిప్ ద‌ర్శ‌క‌త్వంలో అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీలోనూ సామ్ నటించనున్నారు.

More News

ఖిలాడిలో 'చంద్రకళ'గా సిగ్గుపడుతోన్న అనసూయ.. ఎంత పద్ధతిగా వుందో..!!

టీవీ షోలు, ఈవెంట్స్‌తో పాటు సినిమాల్లోనూ ఛాన్స్‌లు దక్కించుకుని దూసుకెళ్తున్నారు స్టార్ యాంకర్ అనసూయ. యాంకరింగ్‌తో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు సుకుమార్ లైఫ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు.

చావుకు భయపడను.. ‘‘జడ్’’ కేటగిరీ భద్రతను తిరస్కరించిన అసదుద్దీన్ ఒవైసీ

కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన జడ్‌ కేటగిరీ భద్రతను ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తిరస్కరించారు. తనకు జడ్‌ కేటగిరీ భద్రత అక్కర్లేదన్న ఆయన. అందరిలాగే తాను

'మనసు కోరితే... తగ్గేదే లే'.. అల్లు అర్జున్ జోమాటో యాడ్ చూశారా..?

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా పుష్ప పాటలు, డైలాగులతో హోరెత్తుతోంది.

'డిజె టిల్లు' చూస్తే నవ్వులతో పాండమిక్ ఒత్తిడి అంతా మర్చిపోతారు - హీరోయిన్ నేహా శెట్టి

అన్ని వర్గాల ప్రేక్షకులను 'డిజె టిల్లు' సినిమా ఆకట్టుకుంటుందని చెబుతోంది యువ తార నేహా శెట్టి. ఆమె రాధిక పాత్రలో నటించిన 'డిజె టిల్లు' ఈనెల 12న థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి ‘‘Z’’ కేటగిరీ భద్రత... కేంద్రం కీలక నిర్ణయం

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భద్రతకు సంబంధించి