Samantha:సమంత జీవితాన్ని తలక్రిందులు చేసిన ‘ఆ పాట’.. చైతూతో విడాకులు అందుకేనట : అసలు రీజన్ చెప్పిన సామ్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్‌గా తొలి నుంచి వున్న ఫేమ్‌కి తోడు, నాగచైతన్యకి విడాకులు, ఇటీవల అనారోగ్యం బారినపడటంతో సమంత ఏం చేసినా.. ఏం మాట్లాడినా వైరల్ అవుతోంది. చివరికి ఆవిడ కట్టుబొట్టు కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. కొద్దిరోజుల క్రితం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడ్డారు సమంత. వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యలతో కృంగిపోయి వున్న ఆమెకు ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో సామ్ మరింత డల్ అయ్యారు. అయినప్పటికీ సమంత యశోదా, శాకుంతలం సినిమాలు చేశారు. గతేడాది విడుదల యశోద మంచి విజయాన్ని అందుకోగా.. శాకుంతలం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వద్దన్నారు :
అయితే ఎక్కడికి వెళ్లినా .. సమంతను అందరూ అడిగే ప్రశ్న నాగచైతన్యతో మీరెందుకు వీడిపోయారనే. కానీ దీనికి సామ్ తనకు తాను ఆన్సర్ ఇవ్వలేదు. కానీ ఇన్‌డైరెక్ట్‌గా సమాధానం చెప్పేది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమాలోని ‘‘ఊ అంటావా మావా ఊఊ అంటావా’’ ఐటెం సాంగ్ సందర్భంగా తమ మధ్య విడాకుల ప్రస్తావన వచ్చిందని సామ్ క్లారిటీ ఇచ్చారు. ఆ సాంగ్‌లో నటించొద్దని స్నేహితులు, కుటుంబ సభ్యులు తనకు సూచించారని.. చివరికి తన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఈ విషయంలో నో చెప్పారని సమంత అన్నారు. కానీ తాను మాత్రం.. నేనేందుకు ఆగిపోవాలి అని నన్ను నేను ప్రశ్నించుకుని ముందుకే వెళ్లానని స్పష్టం చేశారు.
నా వైపు నుంచి 100 శాతం ఇచ్చా :
తన వైవాహిక జీవితంలో తన నుంచి నూటికి నూరు శాతం ది బెస్ట్ ఇచ్చానని.. కానీ అది సరిపోలేదని సమంత అన్నారు. సాంగ్ చేసిన తర్వాత తనను ఎంతోమంది అవహేళన చేశారని.. ఇక చాల్లే ఇంట్లో కూర్చొ అంటూ చులకనగా మాట్లాడారని తెలిపారు. కానీ ‘‘ఊ అంటావా’’ సాంగ్ సూపర్‌హిట్ అవ్వడమే కాకుండా తనకు ఎంతో పేరు తీసుకొచ్చిందని ఆమె చెప్పారు. ఈ పాటలోని సాహిత్యంతో పాటు కొత్తగా చేయాలనే తన దృక్పథం వల్లే ఐటెం సాంగ్ చేశానని పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments