Samantha:సమంత జీవితాన్ని తలక్రిందులు చేసిన ‘ఆ పాట’.. చైతూతో విడాకులు అందుకేనట : అసలు రీజన్ చెప్పిన సామ్

  • IndiaGlitz, [Thursday,March 30 2023]

హీరోయిన్‌గా తొలి నుంచి వున్న ఫేమ్‌కి తోడు, నాగచైతన్యకి విడాకులు, ఇటీవల అనారోగ్యం బారినపడటంతో సమంత ఏం చేసినా.. ఏం మాట్లాడినా వైరల్ అవుతోంది. చివరికి ఆవిడ కట్టుబొట్టు కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. కొద్దిరోజుల క్రితం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడ్డారు సమంత. వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యలతో కృంగిపోయి వున్న ఆమెకు ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో సామ్ మరింత డల్ అయ్యారు. అయినప్పటికీ సమంత యశోదా, శాకుంతలం సినిమాలు చేశారు. గతేడాది విడుదల యశోద మంచి విజయాన్ని అందుకోగా.. శాకుంతలం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వద్దన్నారు :

అయితే ఎక్కడికి వెళ్లినా .. సమంతను అందరూ అడిగే ప్రశ్న నాగచైతన్యతో మీరెందుకు వీడిపోయారనే. కానీ దీనికి సామ్ తనకు తాను ఆన్సర్ ఇవ్వలేదు. కానీ ఇన్‌డైరెక్ట్‌గా సమాధానం చెప్పేది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమాలోని ‘‘ఊ అంటావా మావా ఊఊ అంటావా’’ ఐటెం సాంగ్ సందర్భంగా తమ మధ్య విడాకుల ప్రస్తావన వచ్చిందని సామ్ క్లారిటీ ఇచ్చారు. ఆ సాంగ్‌లో నటించొద్దని స్నేహితులు, కుటుంబ సభ్యులు తనకు సూచించారని.. చివరికి తన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఈ విషయంలో నో చెప్పారని సమంత అన్నారు. కానీ తాను మాత్రం.. నేనేందుకు ఆగిపోవాలి అని నన్ను నేను ప్రశ్నించుకుని ముందుకే వెళ్లానని స్పష్టం చేశారు.

నా వైపు నుంచి 100 శాతం ఇచ్చా :

తన వైవాహిక జీవితంలో తన నుంచి నూటికి నూరు శాతం ది బెస్ట్ ఇచ్చానని.. కానీ అది సరిపోలేదని సమంత అన్నారు. సాంగ్ చేసిన తర్వాత తనను ఎంతోమంది అవహేళన చేశారని.. ఇక చాల్లే ఇంట్లో కూర్చొ అంటూ చులకనగా మాట్లాడారని తెలిపారు. కానీ ‘‘ఊ అంటావా’’ సాంగ్ సూపర్‌హిట్ అవ్వడమే కాకుండా తనకు ఎంతో పేరు తీసుకొచ్చిందని ఆమె చెప్పారు. ఈ పాటలోని సాహిత్యంతో పాటు కొత్తగా చేయాలనే తన దృక్పథం వల్లే ఐటెం సాంగ్ చేశానని పేర్కొన్నారు.

More News

Sarath Babu:సీనియర్ నటుడు శరత్ బాబుకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.

Saindhav:డిసెంబర్ 22న 'సైంధవ్' విడుదల

విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం ‘సైంధవ్’ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో

Madhuram:విశ్వక్ సేన్ చేతులు మీదుగా 'మధురం' మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఉదయ్ మరియు వైష్ణవి హీరో హీరోయిన్ లుగా ప్రొడ్యూసర్ బంగార్రాజు

Chiranjeevi:అల్లు అర్జున్ 20 ఇయర్స్ జర్నీ.. చెప్పలేనంత ఆనందంగా వుంది : బన్నీపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

మెగా ఫ్యామిలీలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ల తర్వాత వచ్చిన తర్వాతి తరం నటుడు అల్లు అర్జున్.

Karnataka:కర్ణాటక ఎన్నికలకు మోగిన నగారా.. మే 10న పోలింగ్, తొలిసారిగా ‘‘ఓట్ ఫ్రమ్ హోమ్‌’’ విధానం

దక్షిణాదిలో వున్న కీలక రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.