నాగ్ తో మరోసారి సమంత...

  • IndiaGlitz, [Saturday,January 07 2017]

మ‌నంలో త‌ల్లిపాత్ర‌లో స‌మంత‌, కొడుకు పాత్ర‌లో నాగ్ న‌టించి అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే. మ‌నం త‌ర్వాత చైతు, స‌మంత ల‌వ్‌లో ప‌డ‌టం, వీరి ప్రేమ‌కు నాగ్ స‌హా ఇరు కుటుంబాల పెద్ద‌లు అంగీక‌రించ‌డం కూడా అంద‌రికీ తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ జంట ఒక్క‌టి కానున్నారు. ఇప్పుడు మామ‌య్య కానున్న నాగార్జున‌తో స‌మంత క‌లిసి న‌టించ‌నుండ‌టం విశేషం.

ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగా న‌టిస్తున్న హ‌ర్ర‌ర్ చిత్రం రాజుగారి గ‌ది2 చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్‌గా స‌మంత న‌టించ‌నుందన‌టి టాక్‌. అల్రెడి సీర‌త్ క‌పూర్ ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌రో మూడో హీరోయిన్ ఎవ‌ర‌నేది తెలియాల్సి ఉంది. మ‌రి స‌మంత ఎలాంటి పాత్ర‌లో క‌న‌ప‌డుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే...