సిద్ధార్థ్‌తో రిలేషన్ గురించి సమంత ఏం చెప్పిందో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్‌గా సమంత కెరీర్ ప్రారంభంలో మంచి విజయాలు సాధించి స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపునే సంపాదించుకుంది. అదే సమయంలో హీరో సిద్ధార్థ్‌తో కొంతకాలం రిలేషన్ షిప్ కొనసాగించింది. వీరిద్దరూ కలిసి జంటగా పలు సందర్భాల్లో కెమెరాల కంటికి చిక్కారు. అప్పట్లో వీరి రిలేషన్ గురించి పలు వార్తలు వినిపించాయి. అయితే ఏమైందో కానీ.. ఇద్దరికీ బ్రేకప్ అయ్యింది. తన బ్రేకప్ గురించి సమంత ఎక్కడా నోరు మెదపలేదు. తర్వాత నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత అక్కినేని వారింటి కోడలుగా మారింది.
ఇన్నేళ్ల తర్వాత ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్‌తో బ్రేకప్ గురించి మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన చేదు అనుభవమని చెప్పింది. ‘‘సావిత్రిగారి తరహాలో నేను కూడా మానసిక సంఘర్షణలో పడిపోయేదాన్ని. అయితే నా రిలేషన్ షిప్ కొనసాగితే బాధే మిగులుతుందనే నిజాన్ని దేవుడి దయ వల్ల గ్రహించాను. అందువల్ల రిలేషన్ షిప్ నుండి బయటకు వచ్చేశాను. తర్వాత నాగచైతన్య నా జీవితంలోకి ప్రవేశించారు. తను అద్భుతమైన వ్యక్తి’’ అన్నారు. 2017లో నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com