సమంత ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ఫుల్ కథానాయికగా పేరు తెచ్చుకున్నారు సమంత. ఈ ఏడాది కూడా ఈ ముద్దుగుమ్మకి బాగానే కలిసొస్తోంది. ముఖ్యంగా ఈ వేసవిలో ఈ చెన్నై చిన్నది నటించిన రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
ఈ నేపథ్యంలో.. సమంత తదుపరి చిత్రాలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సమంత.. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న యూ టర్న్ చిత్రంతో పాటు.. సూపర్ డిలక్స్, సీమా రాజా అనే తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఉంది.
అదేమిటంటే.. ఈ సినిమాలకు డబ్బింగ్ చెప్పే ఛాన్స్‌ను మరెవరికి ఇవ్వడంలేదు సమంత. రెండు భాషల్లోనూ ఈ మూడు చిత్రాల్లోని తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకోబోతున్నారు సమంత. మహానటితో తెలుగులోనూ డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టిన సమంత.. మొత్తానికి నటిగా పరిపూర్ణతను పొందే దిశగా అడుగులు వేస్తున్నారన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com