సమంత నయా క్రియ... క్యా కియ!
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియాలో.. మరీ ఇన్‌స్టాలో సమంతను ఫాలో అయ్యేవారికి కొత్త కొత్త టాస్కులు ఎదురవుతుంటాయి. సమంత మోసే బరువులు, చేసే ఫీట్సూ చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. జిమ్ముల్లో ఆమె వర్కవుట్లు చూసి వావ్ అనుకోని వారు అరుదుగా ఉంటారు. మొన్న మొన్నటి దాకా జిమ్‌లో కసరత్తులు చేసిన అక్కినేని వారి కోడలు ఇప్పుడు కంప్లీట్‌గా మారిపోయింది.
లాక్డౌన్ మీలో తెచ్చిన మార్పులు ఏంటి? అని ఎవరైనా సమంతను అడిగితే చెప్పడానికి పెద్ద చిట్టానే రెడీ చేసుకుంది. రూఫ్ గార్డెనింగ్, గ్రీన్ వెజ్జీస్ని ఎలా పెంచాలి? ఎలా కట్ చేయాలి? ఇష్టమైన ఫుడ్.. సేమ్ టైమ్ హెల్దీ ఫుడ్‌ని ఎలా ప్రిపేర్ చేయాలి?... ఇలాంటి విషయాలు చాలానే చెప్పేస్తుంది సమంత.
లేటెస్ట్ గా వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ అంటూ రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. ముందు దీపం కాంతి ఉంది. మెత్తటి పరుపు మీద కూర్చున్న ఈషా క్రియ మొదలుపెట్టింది. తానే కాదు... తన ఫ్యాన్స్ కూడా ఈ క్రియలో తనతో పాటు పార్టిసిపేట్ చేయాలని కోరింది. 48 డేస్ ఈ క్రియను చేస్తే, రిజల్ట్ ఏంటన్నది ఆటోమేటిగ్గా తెలుస్తుందని సమంత నమ్మకం.
సో అక్కినేని అభిమానులు, మరీ ముఖ్యంగా సమంత ఫిట్‌నెస్‌ని ఆరాధించేవారందరూ ఇప్పటికే ఈషా క్రియ గురించి సెర్చింగ్ మొదలుపెట్టేశారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com