స‌మంత టైటిల్ ఏంటో తెలుసా?

  • IndiaGlitz, [Friday,December 14 2018]

ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో మెప్పించిన స‌మంత పెళ్లి త‌ర్వాత పెర్ఫామెన్స్ పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంది. ఇటీవ‌ల ఆమె న‌టించిన 'యూ ట‌ర్న్‌' సినిమా న‌టిగా స‌మంత‌కు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ప్ర‌స్తుతం 'నిన్నుకోరి' ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర్త నాగ‌చైత‌న్యతో క‌లిసి ఓ సినిమా న‌టిస్తుంది.

ఇది కాకుండా నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీ రీమేక్‌లో న‌టించ‌నుంది. ఇందులో అతీత శ‌క్తులున్న వృద్ధురాలు త‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు అందమైన అమ్మాయిగా మారిపోతుందట‌.

సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఓ బేబి ఎంత స‌క్కగున్నావే' అనే టైటిల్‌ను పెట్టిన‌ట్టు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈసినిమాకు సంబంధించిన వార్త‌లు వెలువ‌డ‌తాయి.