సమంత.. మిలియన్ డాలర్ క్వీన్
Send us your feedback to audioarticles@vaarta.com
అదృష్టం అనే మాటకి పర్యాయపదంలా నిలిచిన కథానాయిక సమంత. కెరీర్‌లో సింహభాగం విజయాలను చవిచూసిన ఈ ముద్దుగుమ్మ.. ఓ విషయంలో తన తోటి కథానాయికలకుఎవరికి సొంతం కాని రికార్డు కైవసం చేసుకుంది. కాస్త వివరాల్లోకి వెళితే.. యు.ఎస్ కలెక్షన్ల పరంగా మిలియన్ డాలర్ల క్లబ్ అనేది ఎంతో ప్రతిష్ఠాత్మకం అనేది తెలిసిందే. ఈ లిస్ట్‌లో చేరిన తొలి టాలీవుడ్ మూవీగా నిలిచింది.. 2011లో విడుదలైన 'దూకుడు' చిత్రం. మహేశ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించింది. 'దూకుడు' మొదలు.. ప్రతి ఏడాది తన ఖాతాలో ఓ మిలియన్ డాలర్ మూవీని నమోదు చేసుకుంటోంది సమంత.
అలా.. తాజాగా రిలీజైన 'రంగస్థలం'తో ఇప్పటివరకు ఏ దక్షిణాది కథానాయికకు సొంతం కాని రికార్డుని సొంతం చేసుకున్నట్లయ్యింది. దూకుడు (2011), ఈగ (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది (2013), మనం (2014), సన్నాఫ్ సత్యమూర్తి(2015), తెరి (తమిళ్), 24, బ్రహ్మోత్సవం, జనతా గ్యారేజ్ (2016), మెర్సల్ (తమిళ్) (2017).. తాజాగా 'రంగస్థలం' (2018).. ఇలా 13 చిత్రాలతో మిలియన్ డాలర్ల క్లబ్‌లో క్వీన్‌గా నిలిచిపోయింది సమంత. మున్ముందు కూడా ఈ పరంపర కొనసాగిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments