సమంత పెళ్లి చీర విశేషం...

  • IndiaGlitz, [Thursday,August 03 2017]

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత అక్టోబ‌ర్ 6న ఒకింటివారు కాబోతున్నారు. గోవాలో అక్టోబ‌ర్ 6 నుండి 9 వ‌ర‌కు పెళ్లి తంతు జ‌ర‌గుతుంది. హిందూ సంప్ర‌దాయంలో, త‌ర్వాత క్రిస్టియ‌న్ సంప్ర‌దాయంలో పెళ్లి జ‌రుగుతుంద‌ట‌. స్టైలిష్ డిజైన‌ర్ క్రేషా బ‌జాజ్ స‌మంత పెళ్లి దుస్తుల‌ను డిజైన్ చేస్తున్నార‌ట‌. అయితే స‌మంత హిందూ సంప్ర‌దాయంలో జ‌ర‌గ‌బోయే పెళ్లికి మాత్రం త‌న అమ‌మ్మ చీర‌ను క‌ట్టుకుంటుంద‌ని అంటున్నారు. పెళ్లి పీట‌లెక్క‌బోతున్నా కూడా స‌మంత వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంటుంది. పెళ్లి త‌ర్వాత కూడా ఎక్కువ స‌మయం తీసుకోకుండా మ‌ళ్లీ షూటింగ్స్‌లో పాల్గొంటుంద‌ని స‌మాచారం.