మరిది కోసం వదినమ్మ.. ఈసారైనా అదృష్టం వరించేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
సిసింద్రీగా టాలీవుడ్‌కి పరిచయమైనా... హీరోగా మాత్రం అనుకున్నంత స్థాయిలో అఖిల్ రాణించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసిన అఖిల్.. ఒక్క హిట్ కొట్టలేకపోయాడు. తాజాగా నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఒకనాటి సెన్షేషనల్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఎలాంటి ఆర్భాటం లేకుండా.. షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. అక్కినేని వారి కోడలు.. అఖిల్ వదిన.. స్టార్ హీరోయిన్ సమంత.. ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటిస్తోందట. అథితిగా కాసేపు పలకరించి వెళుతుందని చెబుతున్నారు.
గతంలో అక్కినేని ఫ్యామిలీ సినిమా ‘మనం’లో చివరిలో అఖిల్ మెరుస్తాడు. సినిమా క్లైమాక్స్‌లో వచ్చి అందరినీ అలరిస్తాడు. దివంగత నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత నటించిన ఈ సినిమాలో అతిథి పాత్రలో అఖిల్ కనిపించాడు. అయితే ఇక్కడ మరిదిగారి సినిమాలో వదినమ్మ గెస్ట్ రోల్ చేయనుంది. ‘బొమ్మరిల్లు’ సినిమాలో… హీరో సిద్ధార్థ్, తన కథను నటి జయలక్ష్మికి చెప్పినట్టు.. సమంతకు అఖిల్ తన స్టోరీ చెప్పేలా కథను సిద్ధం చేశారని సమాచారం. దీనికి సమంత కూడా అంగీకరించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది నాగార్జున నటించిన ‘మన్మథుడు 2’లో సమంత అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments