సమంత కథానాయిక.. సిమ్రాన్ విలన్..

  • IndiaGlitz, [Friday,January 12 2018]

సిమ్రాన్‌.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏకకాలంలో నెంబ‌ర్ వ‌న్ క‌థానాయిక‌గా రాణించిన నిన్న‌టి త‌రం హీరోయిన్‌. పెళ్ళ‌య్యాక‌.. హీరోయిన్ నుంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ట‌ర్న్ అయిన ఈ ముద్దుగుమ్మ‌.. ప్ర‌స్తుతం ఓ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తోంది. త‌మిళ నాట క్రేజీ క‌థానాయ‌కుడిగా పేరు తెచ్చుకుంటున్న శివ‌కార్తీకేయ‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

వ‌రుత్త ప‌డాద వాలిబ‌ర్ సంఘం (క‌రెంట్ తీగ చిత్రానికి ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌), ర‌జ‌నీ మురుగ‌న్ వంటి హిట్ చిత్రాల త‌రువాత ద‌ర్శ‌కుడు పొన్ రామ్‌తో శివ‌కార్తీకేయ‌న్ చేస్తున్న‌ ఈ హ్యాట్రిక్ ప్ర‌య‌త్నంలో.. సిమ్రాన్ పాత్ర చాలా కీల‌క‌మ‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు విక్ర‌మ్‌, గౌత‌మ్ మీన‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ధ్రువ న‌క్ష‌త్రం సినిమాలోనూ సిమ్రాన్ ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. మ‌రి.. క‌థానాయిక‌గా అల‌రించిన సిమ్రాన్‌.. విల‌న్‌గానూ మెప్పిస్తుందేమో చూడాలి.

More News

నిహారిక సినిమా పూర్తయ్యింది

మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక ఒక మనసు చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన సంగతి తెలిసిందే.

వేసవిలో విజయ్ సందడి

పెళ్ళి చూపులుతో సోలో హీరోగా తొలి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ..

సూపర్‌స్టార్‌ కృష్ణ 'అసాధ్యుడు' చిత్రానికి 50 వసంతాలు

సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'అసాధ్యుడు' 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. టైగర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.రామచంద్రరావు దర్శకత్వంలో నెల్లూరు కాంతారావు, ఎస్‌.హెచ్‌.హుస్సేన్మ్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12, 1968న విడుదలైంది. హీరోగా మంచి ఇమేజ్‌ తీసుకొచ్చిన 'గూఢచారి 116' చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ కృష్ణ చేసిన సినిమ&#

ల‌ఘు చిత్రాల్లో స్టార్స్‌...

ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌లు పెంపొందించుట‌కు పోలీసు విభాగం ల‌ఘు చిత్రాలు చేస్తుంది. ఈ ల‌ఘ‌చిత్రాల్లో టాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖులు న‌టించారు. వారిలో ముఖ్యంగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, అర్జున్ రెడ్డితో యూత్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

వి.వి వినాయక్ చేతులమీదుగా 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' ధియేటరికల్ ట్రైలర్ విడుదల

నందు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇంతలో ఎన్నెన్ని వింతలో.