సమంత ఈజ్ బ్యాక్
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత అక్కినేనికి ఏమైంది? అని చాలా రోజులుగా ఆమె అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. సాధారణంగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత..ఇప్పడు కామ్ అయిపోయారు. క్వారంటైన్ టైమ్‌లో సోషల్ మీడియాలో తన అభిమాన హీరోయిన్ సైలెంట్ అయిపోవడం వెనుక కారణమేంటో ఎవరికీ అర్థం కాలేదు. దీంతో సమంత ప్రెగ్నెంట్ అని కొన్ని వార్తలు వినిపించాయి. సమంత కొత్త కథలను వింటుందని కూడా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇన్నీ వార్తలు వచ్చినా కూడా సమంత అక్కినేని ఏమాత్రం స్పందించలేదు.
అయితే ఎట్టకేలకు సమంత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన స్పందనను తెలియజేసింది. తన కుక్క పిల్లతో నిద్రిస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది. ‘లాంగ్ స్లీప్ తర్వాత వచ్చా.. స్టే హీమ్, స్టే సేఫ్టీ. మీకోసం దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ మెసేజ్‌ను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం సమంత భర్త నాగచైతన్య, తన కుక్క హష్‌తో ఇంటికే పరిమితమైంది. అంతే కాకుండా రెండు తమిళ సినిమాల్లో నటించడానికి ఓకే అందని టాక్. అలాగే నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని కూడా వార్తలు వినపడుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాతే సినిమాలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com